నవతెలంగాణ – నెల్లికుదురు
కల్లుగీత కార్మికుల సంఘం సమస్యలను తక్షణమే ప్రభుత్వాలు పరిష్కరించాలని కల్లుగీత కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి శీలం సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు తెలిపారు. మండలంలోని ఎర్రబెల్లి గూడెం గ్రామంలో ఆ గ్రామ సొసైటీ అధ్యక్షుడు పల్లె వెంకట్ రాములు ఆధ్వర్యంలో జెండాను ఎగరవేసి మండలంలోని వివిధ గ్రామాలలో కేజీ కేఎస్ జెండాను ఆవిష్కరించే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాలలో కేజీకేఎస్ సంఘం ఆధ్వర్యంలో కల్లుగీత కార్మికుల సంఘం 67 వార్షికోత్సవం ఘనంగా నిర్వహించుకున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్లుగీత కార్మికుల సమస్య అయినా పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషన్ తక్షణమే అందించాలని కోరారు. ప్రతి గౌడు కు సేఫ్టీ మోగులను అందరికీ అందించేందుకు కృషి చేయాలని అన్నాడు. మెడికల్ స్టడీ లిస్టును తక్షణమే తొలగించాలని అన్నారు. ప్రతి గ్రామ సొసైటీకి పది గల భూమిని ఇచ్చి గౌడ కులస్తులను ఆదుకోవాలని కోరినట్టు తెలిపారు. కళ్ళు గీత కార్మికుల సమస్యలను మన పరిష్కరించాలంటే మనమందరం ఐక్యతగా ఉండి ఒక తాటిపైకి వచ్చి ఉద్యమించాల్సిన అవసరం లేకుండా నెలకొన్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెరుగు సత్యనారాయణ. పల్లె వెంకట రాములు,కార్యదర్శి గొల్లపెల్లి సురేష్,మాజీ పెద్ద గౌడ్ పెరుమాండ్ల సాయిలు ఆ గ్రామ మాజీ సర్పంచ్ అశోక్ తదితరులు ఉన్నారు.