ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి..

– దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి

నవతెలంగాణ-దుబ్బాక రూరల్ : దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో ఐకెపి, పిఎసిఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఇలాంటి ఆటంకాలు లేకుండా, వేగవంతంగా జరుగుతుందని ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గంభీర్పూర్, రామక్కపేట గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేసిన తర్వాత లారీల కొరతతో కేంద్రాల్లోనే ధాన్యము బస్తాలు రోజుల తరబడి  నిలవ ఉంటున్నాయని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే అధికారులతో మాట్లాడి ధాన్యం రవాణాకు లారీలను ఏర్పాటు చేశారు. అనంతరం ఎంపీపీ పుష్పలత మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వేగంగా కొనుగోలు ప్రక్రియ జరిగేటట్టు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఎక్కడైనా తూకం వేసిన ధాన్యం బస్తాల రవాణాకు వాహనాల కొరత ఉన్నట్టయితే, తక్షణమే అక్కడికి లారీలను పంపిస్తున్నామన్నారు. అధికారుల, రైస్ మిల్లు యజమానుల సమన్వయంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గుండెల్లి ఎల్లారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ షేర్ల కైలాసం,
బీఆర్ఎస్ నాయకులు కిషన్ రెడ్డి, సంగెపు  స్వామి,చింతల ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
Spread the love