రూ.4వేల జీవనభృతిని ఇస్తామన్న హామీ నేరవేర్చాలి..

The promise of Rs. 4000 living allowance should be committed.నవతెలంగాణ – డిచ్ పల్లి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీడీ కార్మికులను ఆదుకోవడానికి రూ.4000 రూపాయల జీవనభృతిని ఇస్తామని హామీ ఇచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్న ఇంతవరకు జీవన భృతి అమలు చేయకపోవడం విచారకరమని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా  ప్రధాన కార్యదర్శి వెంకన్న అన్నారు. బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇందల్ వాయి ఆర్టీసీ బస్టాండ్ నుండి తాహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి డిప్యూటీ తహసిల్దార్ శైలజా  కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ బీడీ పరిశ్రమలో సుమారు 7 లక్షల మంది పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నా రని అన్నారు. గతంలో నెలకు 26 రోజుల పని దొరికేదని ఇప్పుడు పరిస్థితులలో నెలకు 8 నుండి 12 రోజులు పని మాత్రమే దొరుకుతుందన్నారు. బీడీ పరిశ్రమలో చేతినిండా పని దొరకక కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తద్వారా కుటుంబ పోషణ భారమై దినదిన ఘంటంగా గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తక్షణం అమలు చేయాలని, రేషన్ కార్డు లేని వారికి నూతన రేషన్ కార్డు ఇవ్వాలని, ఇంటి స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి పది లక్షల రూపాయల రుణాన్ని  ఇవ్వాలని అన్నారు. బీడీ పరిశ్రమలు పనిచేస్తున్న వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగులందరికీ జీవనభృతిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ యూనియన్ జిల్లా కోశాధికారి కిషన్, ఏఐపిఎం కేఎస్ జిల్లా అధ్యక్షులు సాయ గౌడ్, జిల్లా నాయకులు మురళి, మోహన్, కార్మికుల సుజాత, లావణ్య, అమూల్య, సుజాత, లలిత, లక్ష్మి, సరోజ, నందిని ,రజిత తో పాటు ఇతరులు పాల్గొన్నారు.
Spread the love