ప్రచార చిత్రమే : కేరళ స్టోరీపై కమల్‌

అబుదాబీ : కేరళ స్టోరీ ప్రచార చిత్రమేనని ప్రముఖ సినీ నటుడు కమల్‌ హసన్‌ వ్యాఖ్యానించారు. ఇలాంటి వాటికి తాను వ్యతిరేకినని ఆయన చెప్పారు. సినీ అవార్డు స్వీకరించేందుకు అబుదాబీ వచ్చిన కమల్‌ విలేకరులతో మాట్లాడుతూ వాస్తవంగా జరిగిన సంఘటన ఆధారంగా సినిమా తీశారంటే సరిపోదని అన్నారు.తాను చిన్న చిత్రా లకు అభిమానినని, చిన్న పిల్లలు ఎలా అయితే పెద్ద వారి గా ఎదుగుతారో తాను కూడా అలాగే చిన్న చిత్రాలలో నటించి ఈ స్థాయికి చేరానని తెలిపారు.అవార్డుల కంటే ప్రేక్షకాదరణ ముఖ్యమని కమల్‌ చెప్పారు.

Spread the love