హాస్టల్ వార్డెన్ ల ఆస్తులపై విచారణ చేయాలి

– గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి శంకర్ నాయక్ డిమాండ్
నవతెలంగాణ – అచ్చంపేట 
నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ హాస్టల్ వార్డెన్ల స్థిరాస్తులు, చర ఆస్తులపై విచారణ చేయాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి శంకర్ నాయక్ చేశారు. గురువారం పైన నవతెలంగాణ తో మాట్లాడారు. హాస్టల్లో విద్యార్థుల సంఖ్య పరిమితంగా ఉంటే ఆన్లైన్లో అధికంగా చూపిస్తూ ప్రభుత్వ సొమ్మును దోచుకుంటున్నారని, ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రతి ఏడాది తన ఆస్తుల వివరాలను తన పై అధికారికి జిల్లా కలెక్టర్  నివేదిక ఇవ్వాలని నిబంధనలు ఉన్నప్పటికీ ఉన్నత అధికారుల నిర్లక్ష్యం కారణంగా అమలు కావడం లేదన్నారు. హాస్టల్లో పనితీరుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కనిపించకపోవడంతో వార్డెన్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అచ్చంపేట నియోజకవర్గం లో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న ప్రభుత్వ వాడెను వివరాలను సేకరించి ఇన్కంటాక్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో 10 ఆశ్రమ పాఠశాలలు, గిరిజన సంక్షేమ హాస్టల్లో 8 ఉన్నాయి. అదేవిధంగా బీసీ సంక్షేమ హాస్టల్ నాలుగు వసతి గృహాలు ఉన్నాయి రెండు కాలేజీ హాస్టల్లో ఉన్నాయి. ఎస్సీ సాంఘక సంక్షేమ హాస్టల్లో పది హాస్టల్లో ఉన్నాయి. పేద విద్యార్థులు ఇంటికాడ ఆర్థిక పరిస్థితులు బాగాలేక హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారని అన్నారు. పేద విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారంగా భోజనం పెట్టకుండా ఇష్టానుసారంగా నాసిరికమైన భోజనం పెడుతూ ప్రభుత్వ సొమ్ముకు దోచుకుంటున్నారని ఆరోపించారు. త్వరలోనే అక్రమ ఆస్తులు ఉన్న వార్డెన్ లనుగుర్తించి కలెక్టరుకు,  ఇన్కంటాక్స్ ఆఫీసర్లకు ఫిర్యాదు  చేయనున్నట్లు తెలిపారు.

Spread the love