నవతెలంగాణ – సిద్దిపేట
న్యాయ బద్ధమైన డిమాండ్లను సీఎం కేసీఆర్ నెరవేర్చాల్సిన అవసరం ఉందని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నాయకులు రాజేష్ కోరారు. గురువారం సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 7 వ రోజుకు చేరాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణ కేసీఆర్ మనసు మార్చు మమ్మల్లి రెగ్యులరైజ్ చేయాలని వేడుకున్నారు.ఉద్యోగుల పిల్లలు చిన్ని కృష్ణయ్య, గోపిక వేషాధరణ ధరించి సీఎంను వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ . జిల్లా విద్యాశాఖ కార్యాలయాలలో, మండల విద్యాశాఖ అధికారి కార్యాలయాలలో అధికారులకు ఇటు ఉపాధ్యాయలకు వారధిగా ఉంటూ ఉదయం అందరికంటే ముందుగా వచ్చి సాయంత్రం అందరికంటే ఆలస్యంగా ఇంటికి వెళ్ళేది సమగ్ర శిక్ష ఉద్యోగులే అన్నారు. పాఠశాలల్లో విద్య ప్రమాణాలు సరైన పద్దతిలో వెళ్లి విద్య లో ఉత్తమ ఫలితాలు సాదించుటలో ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్లు, ఆపరేటర్లు, సమగ్ర శిక్ష ఉద్యోగుల పాత్ర మరువలేనిది అన్నారు. తక్షణమే ప్రభుత్వం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు