ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసిన ప్రజా ప్రతినిధులు.. విడిసి సభ్యులు..

నవతెలంగాణ డిచ్ పల్లి: నిజామాబాద్ రూరల్ నీయోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డిని ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి మాజీ ఎంపీటీసీ చింతల కిషన్, బోర్వేల్ రాజేందర్ రెడ్డిలు మర్యాద పూర్వకంగా కలిసి శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. తిర్మన్ పల్లి గ్రామ అభివృద్ది కమిటీ చైర్మన్ గోపు గోవర్ధన్ అధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డిని కలిసి సన్మానించారు. ఎమ్మెల్యేగా గెలుపొంది మొదటి సారిగా గ్రామం మీదుగా వేళ్తుండాగ మాజీ ఎంపీటీసీ చింతల కిషన్, రాజేందర్ రెడ్డిలు కలిసి దర్పల్లి రాహదరికి అనుకుని ఉన్న రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించాలని కోరిన వేంటనే ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


అలయన్ని నూతనంగా నిర్మించడానికి సహాయ సహకారాలు అందజేయాలని గ్రామ గౌడ సంఘ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వచ్చారు. అలయ విశిష్టత గురించి అడిగి తెలుసుకుని దేవాదాయ శాఖ నుండి నీదులు మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్, డైరెక్టర్ కోరట్ పల్లి అనంద్, మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి, సంతోష్ రెడ్డి,కంచేట్టి గంగాధర్, డాక్టర్ శాదుల్లా,డాక్టర్ శ్రీనివాస్, బైరయ్య ఎల్ఐసీ గంగాధర్, హబిబ్, ప్రవీణ్ గౌడ్, రాజనర్స గౌడ్, జామ మాస్ జిద్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అహ్మద్, జంగిలి లక్ష్మి, మోహ్సిన్, చెక్ పావర్ ఎర్రోళ్ల సాయన్న, మురళి గౌడ్, మహేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Spread the love