– పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
– 401 ప్రాంతాల్లో వర్షపాతం నమోదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో 401 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. వచ్చే రెండు,మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో, మోస్తరు వానలు ఎక్కువచోట్ల పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. ఆ జాబితాలో ఆదిలాబాద్, కొమ్రంభీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సిద్దిపేట, సూర్యాపేట, రంగారెడ్డి, యాదాద్రిభువనగిరి, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలున్నాయి. శుక్రవారం రాత్రి పది గంటల వరకు రాష్ట్రంలో 401 ప్రాంతాల్లో వర్షం పడింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో అత్యధికంగా 8.10 సెంటీమీటర్ల వాన పడింది. 93 ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది.
వేగంగా విస్తరిస్తున్న నైరుతి
4:04 am