సామ్‌సంగ్‌ ఐదో తరం ఫోల్డబుల్‌ ఫోన్ల విడుదల

సియోల్‌ : రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్‌ తన ఐదో తరం గెలాక్సీ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్లు జడ్‌ఫ్లిప్‌ 5 పేరుతో విడుదల చేసింది. ఇవి సొగసైన, కాంపాక్ట్‌ డిజైన్‌లు, లెక్కలేనన్ని కస్టమైజేషన్‌ ఎంపికలు, శక్తివంత మైన పనితీరుతో ప్రతి వినియోగదారునికి ప్రత్యేక అనుభవాలను అందిస్తాయని ఆ సంస్థ పేర్కొంది. సృజనాత్మక కోణాల నుంచి ఫోటోలను తీసేందుకు ఫ్లెక్స్‌ కామ్‌ వంటి అసాధారణ కెమెరా సామర్థ్యాలను కూడా అన్‌లాక్‌ చేస్తాయని పేర్కొంది. డ్యామేజ్‌ ప్రొటెక్షన్‌ కోసం గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ 2తో మరింత మన్నికగా ఉండేలా పలు జాగ్రత్తలు తీసుకుని తయారు చేసినట్లు పేర్కొంది.

Spread the love