నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని హెచ్ కెలూరు గ్రామంలో గల యుపిఎస్ పాఠశాలలో మరాఠీ బోధన మాధ్యమాన్ని 2019లో తెలుగు మద్యమం బోధన కొరకు విద్యాశాఖ ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. గడిచిన ఐదు సంవత్సరాలు కాలంగా తెలుగు మధ్యమం బోధన ఉపాధ్యాయులను నియమించడంలో మండల విద్య శాఖ అధికారులు పట్టించుకోకపోవడం లేదంటూ ఈనెల నాలుగో తేదీన గ్రామస్తులంతా మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రానికి తరలివచ్చి మండల విద్యాశాఖ అధికారికి ఒక వినతి పత్రాన్ని అందజేశారు. గ్రామస్తుల వినతికి ఒకటి రెండు రోజుల్లోనే ఇద్దరు లేదా ముగ్గురు తెలుగు మాధ్యమ టీచర్లకు నియమిస్తానని, మండల విద్యాశాఖ అధికారి రాములు నాయక్ హామీ ఇచ్చి నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారంటూ మండల విద్యాశాఖ నిర్లక్ష్యానికి ఆ గ్రామస్తులు సోమవారం నాడు జరిగిన కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్కు హెచ్ కేలూర్ పాఠశాల విద్యార్థుల సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామస్తులు అందజేసిన వినతిపత్రాన్ని కలెక్టర్ చూసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలంగా విద్యాశాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు అనే విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులకు ప్రశ్నించినట్లు తెలిసింది. ఏది ఏమైనా గ్రామస్తుల వినతులకు మండల విద్యాశాఖ అధికారి ఏమాత్రం పట్టించుకోవడంలేదని విషయం జిల్లా కలెక్టర్కు చేరింది. ఈ సమస్య వెంటనే తీర్చాలని జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశించిన వినత్పత్రాన్ని మంగళవారం నాడు మండల కేంద్రంలో హెచ్ కె లూరు గ్రామ పెద్దలు విలేకరులకు అందజేశారు.