రాష్ట్ర వనరులు, సంపదను ప్రజలకే పంచుతాం: భట్టి

నవతెలగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా లో ఏర్పాటు చేసిన రైతు భరోసా సదస్సులో మాట్లాడుతూ.. ‘రాష్ట్ర వనరులు, సంపదను ప్రజలకే పంచుతాం. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాం. పంటలకు పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా ఇస్తామని చెప్పాం. ఇప్పటికే రైతు బంధు కింద రైతులకు నిధులు విడుదల చేశాం. ఈనెలలోనే పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నాం’ అని అన్నారు.
Spread the love