
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఉన్న సహకార సంఘం అవిశ్వాస తీర్మాన ఫలితాలను ప్రకటించాలని ఇన్చార్జి సొసైటీ చైర్మన్ స్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో సొసైటీ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం ఫలితాలు ప్రకటించవద్దని హైకోర్టు ఆర్డర్ తీసుకోవడంతో అట్టి ఫలితాలను ప్రకటించలేదు. అనంతరం ఫలితాలు తెలియజేయవచ్చని సెప్టెంబర్ నెలలో ప్రకటించవద్దు అని ఇచ్చిన హైకోర్టు ఆర్డర్ ను కొట్టు వేయడం జరిగింది. అక్టోబర్ నెలలో అవిశ్వాస తీర్మాన ఫలితాలను తెలియజేయాలని డి సి ఓ కు వినతి పత్రం అందించడం జరిగిందని అప్పటినుండి నేటి వరకు ఫలితాలు వెల్లడించలేదు. న్యాయవ్యవస్థ ఇచ్చిన ఆదేశాల ప్రకారం అవిశ్వాస తీర్మానం ఫలితాలను విడుదల చేసి ఎవరికి అనుకూలంగా ఉన్నాయో తెలియజేయాలని లేనిచో సహకార శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలిపారు.