– హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్ :
సమాజంలో చిన్నతనం నుండి విద్యార్థి దశలో విద్య బుద్ధులు నేర్పించే ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని కేజేఆర్ గార్డెన్ లో ట్రస్మా ఆధ్వర్యంలో గురుపూజోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యను నేర్పి సమాజంలో మంచి పౌరులుగా, భవిష్యత్తులో వారు ఉన్నత స్థానాల్లో స్థిరపడటానికి తోడ్పడేవారన్నారు. తల్లిదండ్రుల తర్వాత అంతటి పాత్ర ఉపాధ్యాయులు పోషిస్తారని ఎమ్మెల్యే కొనియాడారు. ప్రైవేటు ఉపాధ్యాయులకు నా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్మ నాయకులు నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.