ప్రయాణికుడిపై చేయి చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్..

నవతెలంగాణ – హైదరాబాద్: ఓ ప్రయాణికుడిపై ఆర్టీసీ డ్రైవర్ చేయి చేసుకున్న సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మేడ్చల్ డిపోకు చెందిన (TS 10U C 9847) ముందు  రాజలింగం అనే ప్రయానికుడు రామాయంపేట వెళ్లడానికి బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే మేడ్చల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రామాయంపేట వెళ్తుండగా.. ప్రయాణికుడు చెయ్యెత్తి బస్సును ఆపాడు. బస్సు డ్రైవర్ బస్సును ఆపకుండా వెళ్తుండటంతో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రయాణికుడు బూతులు తిట్టడం మొదలెట్టాడు. దీంతో బస్సును డ్రైవర్ పక్కకు ఆపి, రాజలింగం తలపై కర్రతో బలంగా కొట్టాడు. ఈక్రమంలో ప్రయాణికుడికి తల పగిలి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ పై బాదిత ప్రయాణికుడు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

Spread the love