దొరల పాలన మాకొద్దు..రాజయ్య పాలననే ముద్దు

నవతెలంగాణ-ధర్మసాగర్ : దొరల పాలన మాకొద్దు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య పాలనే మాకు ముద్దు అని  తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టే పద్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం మండల కేంద్రంలో దళిత ప్రజా సంఘాల  ఆద్వర్యంలో భారీ ర్యాలీ,మౌనదీక్షలను మాది హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ టీఎం హెచ్ డి ( తెలంగాణ మాదిగ హక్కుల దండోరా)రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టే పద్మయ్య స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం లో మాదిగ లకు అసెంబ్లీ సీటు కేటాయించాలని మాదిగ ముద్దు  బిడ్డ స్థానికులు డాక్టర్ తాడికొండ రాజయ్య కే టిక్కెట్ ఇవ్వాలని ప్రధాన రహదారులపై బైఠాయించి బైండ్ల దొరల పాలన అవసరం లేదని స్థానికుడైన మాదిగల ముద్దుబిడ్డ రాజయ్య పాలననే ముద్దు అని నినాదంతో ప్రధాన రోడ్ల వెంట బయటాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మండల కేంద్రంలోని రాజ్యాంగ నిర్మాత డా,బిఆర్ అంబేడ్కర్‌ విగ్రహం ముందు మాదిగ హక్కుల పరిరక్షణ సమితి,దళిత సంఘాల ఆద్వర్యంలో ఎంహెచ్ పిఎస్ వ్యవస్థాపక అద్యక్షులు మైస.ఉపేందర్ మాదిగ టీఎం హెచ్ డి ( తెలంగాణ మాదిగ హక్కుల దండోరా)రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టే పద్మయ్య నాయకత్వంలో ఒక్కరోజు మౌనదీక్ష  చేపట్టారు.ఈ సందర్భంగా మైస.ఉపేందర్ మాదిగ కొట్టే పద్మయ్య మాట్లాడుతూ మాదిగల ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్రం కొరకు ఎమ్మెల్యే పదవికి తృణప్రాయంగా  రాజీనామా చేసిన తాటికొండ.రాజయ్యకే బిఆర్ఎస్ ప్రభుత్వం స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ సీటు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో మాదిగలకు పెద్దన్నగా నేనున్నానంటూ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజల కష్టాలు తీరుస్తూ ప్రజల ఆశీర్వదంతో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజయ్యను కాదని జనాభా నిష్పత్తి ప్రకారం,రెండు శాతం లేని బైండ్ల కులానికి చెందిన కడియం.శ్రీహరికి అసెంబ్లీ సీటు కేటాయిస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా కొనసాగి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఐదు సంవత్సరాల కాలవ్యవధి ఉన్న స్వార్థ బుద్ధితో రాజయ్య టిక్కెట్ ను గుంజుకోవడం సరి అయినది కాదని అన్నారు. లేనిపక్షంలో ఇటీవల కాలంలో ఆయనకు మాదిగల సత్తా చూపిస్తామని హెచ్చరించారు.తాటికొండ.రాజయ్య కే మాదిగల మద్దతు ఉంటుందని తెలిపారు.అడ్ఢదారిలో అసెంబ్లీ సీటు దక్కించుకున్న బైండ్ల కులానికి చెందిన కడియం.శ్రీహరిని ఓడించి మాదిగల సత్తా చూపిస్తామని తెలిపారు.బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ పునరాలోచన చేసి స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ సీటు తాటికొండ.రాజయ్య కు కేటాయించాలని ఎంహెచ్ పిఎస్,దళిత సంఘాలు ప్రజాసంఘాల నాయకులు ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు.బొడ్డు ప్రతాప్,బాలస్వామి,సీక రవి,మంద ఆరోగ్యం,జోగు మొగిలి,కమలేష్ కురసపల్లి బాలస్వామి,జోజి తదితరులు పాల్గొన్నారు.
Spread the love