అసంతృప్తి తో అధికార పార్టీ సర్పంచులు

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని అధికార పార్టీ సర్పంచులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.  మండల వ్యాప్తంగా 18 గ్రామ పంచాయతీలు ఉండగా వీటిలో  10 గ్రామ పంచాయతీలలో అధికార పార్టీ సర్పంచులు కొనసాగుతున్నారు. వీరిలో బుస్సాపూర్ మచ్చాపూర్ చల్వాయి లక్నవరం రాంనగర్ బాలాజీ నగర్ పాపయ్యపల్లి లక్ష్మీపురం కర్లపల్లి ముత్తాపూర్ పంచాయతీలను అధికార బిఆర్ఎస్ పార్టీ సర్పంచులు కొనసాగుతున్నారు. పలు సందర్భాల్లో కార్యక్రమాల్లో పలు సమావేశాల్లో సర్పంచులకు ప్రాధాన్యత దక్కడం లేదన్నది వీరి వాదన. ఉన్నత క్యాడర్ నాయకులు తమకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని అంటున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు కూడా సమాచారం ఇవ్వని పరిస్థితి నెలకొంది అని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తీసుకువచ్చి గ్రామాలను అభివృద్ధి పరిచి పార్టీ క్యాడర్ను గ్రామాల్లో పటిష్టంగా ఉంచుతున్న సర్పంచ్ లకు అధికార పార్టీ లో ఉండి కూడా ఆదరణకు నోచుకోలేకపోతున్నామని అంటున్నారు. పరిస్థితిలో మార్పు రావాలని లేకపోతే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని పలు వురు సర్పంచ్ లు అంటున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సర్పంచులకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడా కారణమేనని అన్నారు.  ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఇప్పటికైనా జిల్లా ఇన్చార్జి జోక్యం చేసుకొని అత్యవసరంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని చక్కదిద్దాలని లేనియెడల మూల్యం చెల్లించుకోక తప్పదని కొందరు సర్పంచులు బాటంగానే అంటున్నారు.
సర్పంచులు అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే
రాంనగర్ సర్పంచ్ భూక్య మోహన్. మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బీఆర్ఎస్ సర్పంచులలో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మరియు రాంనగర్ సర్పంచ్ భూక్య మోహన్ రాథోడ్ అన్నారు. ఈ విషయాన్ని అధిష్టానం ముందు ఎన్నోసార్లు విన్నవించిన దిద్దుబాటు చర్యలు చేపట్టలేదని అన్నారు. పెద్ద నాయకుల ఒంటెద్దు పోకడల వల్లే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని అన్నారు. ఫోరం సమావేశాల్లో పలుమార్లు సర్పంచులు తమకు జరిగిన అవమానాలను విన్నవించడం జరిగిందన్నారు. పరిస్థితులు ఇంకా తీవ్రం కాకముందే ఉన్నత నాయకులు జోక్యం చేసుకొని చర్చలు సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.
Spread the love