భీమాకోరెగావ్‌ అమరుల త్యాగం మరువలేనిది

నవ తెలంగాణ హుస్నాబాద్‌ రూరల్‌
పీష్వాల అరాచకాలను భరించలేక కొదమసింహాల వలె యుద్ధం చేసిన మహర్‌ వీరుల పోరాట పటిమ ఎంతో గొప్పదని దళిత ప్రజా సంఘాల నాయకులు కేడం లింగమూర్తి అన్నారు. పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో మహారాష్ట్రలోని పూణే ప్రాంతంలో పీష్వాల నిరంకుశంత్వానికి వ్యతిరేకంగా 1818 జనవరి 1న మహర్లు చేసిన చారిత్రాత్మక పోరాట దినాన్ని దళిత, బహుజన, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ నియంతత్వ ధోరణి భరించలేక బానిస సంకెళ్లు తెంచుకొనుటకు మహర్‌ వీరులు ప్రాణాలకు తెగించి పోరు చేశారని అన్నారు. వారి పోరాట స్ఫూర్తి ఎందరికో ఆదర్శమైందని కొనియాడారు. నిమ్న వర్గాల తొలగించుటకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గాదెపాక రవీందర్‌, ముక్కెర సంపత్‌ కుమార్‌, మేకల వీరన్న యాదవ్‌, కొయ్యడ కొమురయ్య, వడ్డేపల్లి మల్లేశం, ఎనగందుల శంకర్‌, మారపల్లి సుధాకర్‌, కొత్తపల్లి అశోక్‌, చందుల వీరసోమయ్య, వెన్న రాజు, వేల్పుల రాజు, కోతి యాదగిరి, రుద్రారపు శరత్‌, పొన్నాల అశోక్‌ పాల్గొన్నారు.
నవ తెలంగాణ -గజ్వేల్‌
అంటరానితనాన్ని శాశ్వతంగా ఉండాలని, ఇంకా బానిసత్వం కింద మగ్గాలని అణిచివేసిన పిష్వా బ్రాహ్మణులపై తిరుగుబాటు చేసి వారి ఓడించిన భీమాకొరెగావ్‌ మహర్‌ వీరుల వారసత్వాన్ని బహుజనులు కొనసాగించాలని దళిత బహుజన ఫ్రంట్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు పిలుపునిచ్చారు. భీమాకోరెగావ్‌ విజరు దివాస్‌ సందర్భంగా సోమవారం గజ్వేల్‌ మండల్‌ బెజుగామ గ్రామంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలదండ వేసి మహార్‌ వీర యోధులకు జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా బ్యాగరి వేణు మాట్లాడుతూ 1818 జనవరి 1న 28 వేల పిష్వాల సైన్యాన్ని 500 మంది మహార్‌ వీరులు ఓడించి చారిత్రకమైన విజయం సాధించారని గుర్తు చేశారు. ప్రతి జనవరి 1న డాక్టర్‌ అంబేద్కర్‌ భీమ్‌ కోరెగావ్‌ వెళ్లి మాహార్‌ వీరుల స్థూపానికి నివాళులర్పించేవారని వేణు గుర్తు చేశారు. మహార్‌ వీరుల విజయాన్ని స్ఫూర్తితో బహుజనులు ఉద్యమించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అండాలు సత్యనారాయణ, గ్రామ అంబేద్కర్‌ యువసేన యూత్‌ అధ్యక్షులు దివాకర్‌,యూత్‌ సభ్యులు రాజు,మధు, కరుణాకర్‌ అనిల్‌, చింటూ,నందు తదితరులు పాల్గొన్నారు.

Spread the love