అమరుల త్యాగాలు మరువలేనివి

నవతెలంగాణ-ధర్మసాగర్
తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి అమరులైన ఎందరో అమర వీరుల త్యాగాలు మరువలేని తాసిల్దార్ మర్కాల రజిని అన్నారు. గురువారం దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజైనా అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఎంపీడీవో జోహార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన వీధులకుండా అమర వీరులకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల అభివృద్ధి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో అమరులకు శ్రద్ధాంజలి ఘటించి ఆమె మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సిద్ధించడానికి కొందరు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బలిదానాలను అర్పించారు. వారి త్యాగాల ఫలితమే నేడు మనము అనుభవిస్తున్నామని కొనియాడరు. వారి త్యాగాలను వెలకట్టలేమని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బండారు రవీందర్, డాక్టర్ గోపీనాథ్, ఎంపీటీసీలు  రాజు యాదవ్, జాలిగపు వనమాల, బొడ్డు శోభా, శ్రీనివాస్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఆఫీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Spread the love