అత్యంత భయానక చిత్రం

అత్యంత భయానక చిత్రంశ్రీరామ్‌, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం హర్రర్‌ చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్‌ ఫిల్మ్‌’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్‌ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్‌ దగ్గుమాటి నిర్మించిన ఈ సినిమా ఈనెల 15వ తేదీన విడుదల కానుంది. తాజాగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ‘ఈశ్వరీ రావుతో ”మరణం అనేది నిజంగానే అంతమా?. మరణించిన తరువాత ఏం జరుగుతుంది అనేది ఎవరైనా చెప్పగలరా?. కోరికలు తీరని వారి ఆత్మలు ఈ భూమ్మీద నిలిచిపోతాయా?. ఆ ఆత్మలు మనకు నిజంగానే హని చేయగలవా?” అంటూ నిజ జీవితంలో కూడా ఎందరో తెలుసుకోవాలనుకునే ఆసక్తికర విషయాలను అవసరాల శ్రీనివాస్‌ అడగడంతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం క్యూరియాసిటీ పెంచింది. యదార్థ సంఘటనల ఆధారంగా రాసుకున్న కథ అని, ఇంతటి భయానక హర్రర్‌ చిత్రాన్ని టాలీవుడ్‌ ఇంతవరకూ చూడలేదని చిత్ర బందం చెబుతోంది. ఈ సినిమా కథ ప్రస్తుతం, అలాగే 1990, 1930లలో.. ఇలా మూడు కాలక్రమాలలో జరుగుతుంది. స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనుందని మేకర్స్‌ తెలిపారు.

Spread the love