మోగిన బడి గంట..

– చాక్లెట్స్ పంచుతూ..పూష్పాలందజేస్తూ విద్యార్థులకు ఘన స్వాగతం
నవతెలంగాణ – బెజ్జంకి
సుమారు 45 రోజులు విద్యార్థులు వేసవి సెలవులు గడిపిన అనంతరం సోమవారం బడి గంట మ్రోగింది. మండలంలోని పాఠశాలలు ప్రారంభమవ్వడంతో విద్యార్థులు బడి పట్టారు.మండలంలోని కల్లెపల్లి ప్రభుత్వ పాఠశాలలకు హజరైన విద్యార్థులకు ఉపాధ్యాయులు చాక్లెట్స్ పంచుతూ.. పుష్పాలందజేస్తూ ఘన స్వాగతం పలికారు.మండల కేంద్రంలోని బాలికల ప్రభుత్వోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఎంఈఓ పావని పరిశీలించారు.విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకునేల ప్రభుత్వ పాఠశాలల్లో చెర్పించాలని ఎంఈఓ పావని సూచించారు.

Spread the love