బడి బస్సు.. ఫిట్‌ లెస్‌!

వాహన సామర్థ్య పరీక్షలకు స్కూల్‌ యజమానుల అనాసక్తి
ఫిట్‌నెస్‌ లేకుండానే బస్సులు
రోడ్డెక్కే ప్రమాదం
తనిఖీలు చేయాలని అధికారులకు
పేరెంట్స్‌ విజ్ఞప్తి
నవతెలంగాణ-సిటీబ్యూరో
నేటి నుంచి పాఠశాలల పున:ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాసంస్థల బస్సు ల ఫిట్‌నెస్‌పై రవాణాశాఖ ప్రత్యేక దృష్టిసారిం చింది. ఫిట్‌నెస్‌ లేకుండా రోడ్లపైకి బస్సులు ఎక్కితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. ప్రతియేటా మే 15న స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌ ముగుస్తోంది. ఈ నేపథ్యంలో 2023-24 విద్యా సంవత్సరానికి గాను నిర్ణీత సమయంలోపు ఫిట్‌నెస్‌ చెక్‌ చేయించుకోవాలని ఆర్టీఏ అధికారు లు సూచిస్తున్నారు. కానీ బడి బస్సుల సామర్థ్య పరీక్షలకు పాఠశాలల యజమానులు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో జూన్‌ 15 తర్వాత ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని ఆర్టీఏ ఉన్నతా ధికారులు నిర్ణయించారు. ఎవరైనా ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ పత్రాలు లేకుండా బస్సులను నడిపితే భారీ పెనాల్టీలు విధించి సీజ్‌ చేస్తామని అధికా రులు హెచ్చరిస్తున్నారు. అయితే అధికారులను హెచ్చరికలను విద్యాసంస్థలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20వేలకుపైగా స్కూళ్లు బస్సులుం డగా.. ఇందులో 30-40శాతం బస్సులకు ఇప్పటి వరకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్స్‌ జారీ కాలేదని సమాచారం. శని ఆదివారాలు సెలవులు కావడంతో సోమవారం నాటికి అవి పూర్తయ్యే పరిస్థితి లేదు. దీంతో పెద్దఎత్తున ఫిట్‌నెస్‌ లేని బడి బస్సులు రోడ్డు ఎక్కే పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయివేటు పాఠశాలల విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలో దాదాపు 20వేలకుపైగా విద్యాసంస్థల బస్సులుండగా.. వీటిలో గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలో 12034 పాఠశాలలు, కళాశాలల బస్సు లున్నాయి. ఇందులో కాలం చెల్లిన బస్సులు మిన హా అన్ని బస్సులకు తప్పనిసరిగా ఫిట్‌నెస్‌ చేయించుకోవాలి. కానీ రాష్ట్రవ్యాప్తంగా సగాని కిపైగా బస్సులకే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్స్‌ జారీ అయ్యాయి. ఇందులో గ్రేటర్‌లోని 12వేలకుపైగా బస్సులకుగాను సుమారు 8వేల స్కూల్‌, కళాశాల బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ పత్రాలు జారీ అయినట్టు సమాచారం. ఇంకా సుమారు 3వేలకుపైగా బస్సులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉన్నట్టు సమాచారం. ఇందులో హైద రాబాద్‌ జిల్లాకు సంబంధించి 920 బస్సులకు ఫిట్‌నెస్‌ పూర్తికాగా రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలు కలిపి సుమారు 6-7వేల బస్సులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు జారీ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఫిట్‌నెస్‌కు రాని బస్సులపై అధికారులు దృష్టిసారించి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
త్వరలో ప్రత్యేక బృందాల ఏర్పాటు..
స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌పై స్పెషల్‌ డ్రైవ్‌ను త్వరలోనే చేపడుతామని హైదరాబాద్‌ జాయింట్‌ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌(జేటీసీ) జె.పాండురంగ నాయక్‌ తెలిపారు. నగరంలోని మొత్తం అయిదు జోన్లకు 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే రంగారెడ్డి, మేడ్చల్‌లోనూ ఇదే తరహా బృందాలను ఏర్పాటు చేయనున్నారు. జేటీసీ, డీటీవోల పర్యవేక్షణలో ఆర్టీవో, ఎంవీఐ, ఏఎంవీఐతో కూడిన బృందా లను రంగంలోకి దిం పనున్నట్టు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి నడిచే విద్యాసంస్థల వాహనాలను గుర్తించి సీజ్‌ చేస్తామని తెలిపారు. ఇప్పటికే నెల రోజుల పాటు సమయం ఇచ్చాం.. మరో వారం రోజుల్లో ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొందని వాహ నాలను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.
ఆటోలపై కూడా ప్రత్యేక నిఘా
చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లలను పాఠశాలలకు ఆటోల్లో పంపిస్తున్నారు. అయితే కొందరు ఆటో డ్రైవర్‌లు ఆటోల్లో దాదాపు 10 మందికి పైగా పిల్లలను ఎక్కించుకుంటున్నారు. దీంతో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆర్టీఏ అధికారులు తల్లిదండ్రు లకు, ఆటో డ్రైవర్లకు ఆరుగురు మించి ఎక్కువ మందిని పంపించకూడదని, ఎక్కించు కోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆరుగురికి మించి ఎక్కువ మందిని తీసుకెళ్లితే డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోనున్నారు.

Spread the love