– అయిదుగురు విద్యార్థులు గైర్హాజరు
నవతెలంగాణ – మద్నూర్
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్షలు లో భాగంగా గురువారం నాడు రెండో రోజు ఇంటర్ రెండవ సంవత్సరం మొదటి పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షలకు గాను మొత్తం విద్యార్థులు 1 62 మంది హాజరు కావలసి ఉండగా మొదటి పరీక్షకు ఐదుగురు విద్యార్థులు గైర్హాజరు అయినట్లు పరీక్ష కేంద్ర చీఫ్ సూపర్డెంట్ గంగాధర్ విలేకరులకు అందజేసిన నివేదికలో పేర్కొన్నారు. పరీక్షల్లో ఎలాంటి మాస్ కాపీయింగ్ జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. భద్రత ఏర్పాట్ల మధ్య పరీక్షలు రెండో రోజు ప్రశాంతంగా ముగిసినట్లు ఆయన తెలిపారు.