రైలు కింద పడి ఆత్మహత్యా యత్నానికి పాల్పడినా ఓ వివాహితను నిజామాబాద్ రెండవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాము కాపాడారు. రెండవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాము తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని హైమద్ పుర కాలానికి చెందిన ఓ వివాహిత కుటుంబ కలహాలతో సోమవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది.దీంతో భర్త రెండవ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ వివాహిత ఫోన్ జీపీఎస్ లొకేషన్ ఆధారంగా నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. రెండవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాము తన సిబ్బంది కలిసి అక్కడికి చేరుకొని గాలించారు. సదరు వివాహిత రైలు కు ఎదురుగా వెళ్తున్నట్లు గమనించారు. హుటాహుటిన వెళ్లి వివాహితను రక్షించినట్లు తెలిపారు. ఎస్ఐ రాము బాధిత మహిళకు కౌన్సెలింగ్ నిర్వహించి పంపించారు. సదరు ఎస్ఐ రాము వివాహిత ప్రాణాలు కాపాడటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.