రెండో టీ20..రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్

నవతెలంగాణ-హైదరాబాద్ : చెన్నై వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ కు దిగింది. ఈ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు రెండు మార్పులు చేసింది. తొలి టీ20లో ఆడిన రింకూ సింగ్ తో పాటు తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్‌లో ఆడ‌డం లేదు. వారి స్థానంలో వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, ధ్రువ్ జురెల్ ఆడుతున్నారు. మ‌రోసారి పేస‌ర్ మ‌హ‌మ్మ‌ద్ షమీ బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు.
అటు ఇంగ్లండ్ కూడా రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. జేమీ స్మిత్‌, బ్రైడాన్ కార్స్ ఆ జ‌ట్టు త‌ర‌ఫున ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేస్తున్నారు. ఇక ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో ఆతిథ్య భార‌త్ తొలి మ్యాచ్‌లో ఘ‌న విజ‌యం సాధించి బోణీ కొట్టిన విష‌యం తెలిసిందే.  ఇక బ్యాటింగ్ ప్రారంబించిన ఇంగ్లండ్  26 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. 6 పరుగుల వద్ద సాల్ట్ (4) ఆర్షదీప్ సింగ్ బౌలింగ్ లో అవుట్ కాగా 26 పరుగుల వద్ద బెన్ డకెట్ (3) వాషీంగ్ టన్ సుందర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో బట్లర్ 18, హరీ బ్రూక్ 1 పరుగులతో ఉన్నారు.
Spread the love