రెండో టీ20 : భారత్ లక్ష్యం ఎంతంటే..?

నవతెలంగాణ-హైదరాబాద్ :  భారత్ తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో ఇంగ్లండ్ బ్యాటింగ్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. దీంతో భారత్ కు 166 పరుగులు లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లలో బట్లర్ 45 బ్రైడాన్ కెర్స్ 31 పరుగులు చేశారు. భారత బౌలర్లలో అక్సర్ పటెల్, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు తీయగా అర్షదీప్ సింగ్, హర్దిక్ పాండ్యా, వాషింగ్ టన్ సుందర్, అభిషెక్ తలో వికెట్ తీశారు.

Spread the love