టీ20 వరల్డ్‌కప్‌లో సంచలనం.. ఆసీస్‌పై అఫ్గాన్‌ ఘన విజయం

నవతెలంగాణ- హైదరాబాద్: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా సూపర్‌-8లో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్‌ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత అఫ్గానిస్థాన్‌ 20 ఓవర్లలో 148/6 స్కోర్‌ చేసింది. అనంతరం ఆసీస్‌ 127 పరుగులకు ఆలౌట్‌ అయింది. అఫ్గాన్‌ బౌలర్లలో నవీన్‌ ఉల్‌ హక్‌ 3, గుల్బదిన్‌ నైబ్‌ 4 వికెట్లు తీశారు. అఫ్గాన్‌ బ్యాటర్లలో గుర్బాజ్‌(60), ఇబ్రహీం జద్రాన్‌(51) పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ క్రికెటర్‌ పాట్‌ కమిన్స్‌ వరుసగా మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్‌ నెలకొల్పారు. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌(59) పరుగులు చేశాడు.

Spread the love