వర్షంలోను ఆగని ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ సేవలు

నవతెలంగాణ -కంటేశ్వర్

నిరంతరం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం వర్షంలోను ఆగకుండా గురువారం సైతం కొనసాగాయి. 24/7 తమ సంస్థ సేవల్లో ముందుంటుందని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు తెలిపారు.  ప్రతిరోజు 200 మందికి నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని రోడ్లపై నిస్సహాయ స్థితిలో ఉన్న అనాధలకి మతిస్థిమితం లేని విదివంచితులకు ఇందూరు క్యాన్సర్ ఆస్పత్రి రోగులకు వారి సహాయకులకు ఈ అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ ఈ కష్టకాలంలోను ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల్లోను నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం ఎంతో మంది ఆకలి తిరుస్తుండటం పట్ల వారి సేవలను పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ సభ్యులు విజ్ఞేష్,కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love