ఆరు గ్యారెంటీలే..’హస్తం’ అస్త్రాలు..

– మహిళల ఓట్లే లక్ష్యంగా
– పార్లమెంట్‌ ఎన్నికల్లోకి..
– చేవెళ్ల నియోజకవర్గంలో 6 లక్షల దరఖాస్తులు
– వంద రోజులు పాలన రెఫరెండంగా ప్రకటించిన సీఎం రేవంత్‌
– పాజిటివ్‌ మౌత్‌ టాక్‌ రంజిత్‌కు కలిసొచ్చే అవకాశం
ఆరు గ్యారంటీలనే అస్త్రంగా హస్తం పార్టీ పార్లమెంట్‌ ఎన్నికల్లోకి వెళ్తోంది. రాష్ట్రంలో ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది ఈ గ్యారంటీలే. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక దాదాపు అన్నీ గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రణాళికలు చేసింది. చాలా పథకాలు ప్రారంభించింది. ఇలా ప్రారంభించిన వాటిల్లో ముఖ్యంగా లబ్దిదారులు మహిళలే. వీరి కేంద్రంగానే కాంగ్రెస్‌ పథకాలు అమలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ పథకాలు కోసం చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోనే లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. లబ్దిపొందిన వారు.. దరఖాస్తులు చేసుకున్న వారంతా కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఆరు గ్యారంటీలే తమను పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలిపిస్తాయని కాంగ్రెస్‌ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్‌ గెలుపు కాంగ్రెస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోం ది. ఆరు గ్యారెంటీలే లక్ష్యంగా మహిళల ఓట్లను టార్గెట్‌ చేసింది. చేవెళ్ల పార్లమెంట్‌ నియోజక వర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ‘అభయ హస్తం’ కింద సుమారు ఆరు లక్షల కుటుం బాలు ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ కుటంబాల్లో మహిళలు సమారు 13 లక్షల మంది ఉంటారు. వీరి ఓట్లే లక్ష్యంగా కాంగ్రెస్‌ నేత లు వ్యూహాలు పన్నుతున్నారు. ప్రస్తుతం మహిళల చూపు ఆరు గ్యారెంటీల వైపే ఉంది. అసెంబ్లీ ఎన్ని కల్లో కూడా ఆరుగ్యారెంటీల పథకానికి ఆకర్షితులై మహిళలు కాంగ్రెస్‌ ఓట్లు వేసి గెలిపించారు. అయితే కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఆరు గ్యారెంటీలలో అమలు చేసిన పథకాలలో మహిళలకు లబ్ది చేకూరేవే ఎక్కువగా ఉన్నాయి. ఆర్‌టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్‌, రూ. 500లకు సబ్సిడీ గ్యాస్‌, రాజీవ్‌ ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంపుతో మహిళలు కాంగ్రెస్‌ను ఆదరించే అవకాశాలు ఎ క్కువగా ఉన్నాయి. కుటుంబంలో మహిళలే లక్ష్యం గా కాంగ్రెస్‌ పథకాలను తీసుకువచ్చింది. ఇంటి బాధ్యతలు మహిళలు చూస్తారు.. వారి కష్టాలు తీర్చే ఉద్దేశంతోనే ఉచిత విద్యుత్‌, రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ తీసుకువచ్చినట్టు కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. వనితలు తలుసుకుంటే.. ప్రభుత్వా న్ని కూల్చడంలోనూ.. నిలబెట్టడంలోనూ సిద్ధంగా ఉంటారని గ్రహించిన కాంగ్రెస్‌ మహిళ ఓటర్లను మచ్చిక చేసుకోవడంలో ఆరుగ్యారెంటీల పథకాలతో సక్సెస్‌ అయినట్టే తెలుస్తోంది. ఇదో జోష్‌లో పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా మహిళ ఓటర్లను తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్‌ నాయకులు కృషి చేస్తున్నారు.
వందరోజులు పాలన రెఫరెండం
కాంగ్రెస్‌ ప్రభుత్వ వంద రోజుల పాలననే ఈ ఎన్నికల్లో రెఫరెండం అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ వందరోజుల పాలన చూసి తమ కు ఓటు వేయాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ వందరోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ప్రజల్లో మంచి అభిప్రాయమే వ్యక్తం అవుతోంది. ఇదే వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో తమకు కలిసివస్తుందని కాంగ్రెస్‌ శ్రేణులు దీమా వ్యక్తం చేస్తున్నారు. చేవెళ్లలో రంజిత్‌రెడ్డి విజయానికి రాష్ట్ర ప్రభుత్వ ఆరుగ్యారెంటీల పథకాల అమలు, వంద రోజుల పాలనే ఆయుధమని కాంగ్రెస్‌ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్‌టీసీ ‘ ఫ్రీ’ కలిసొచ్చే అంశం
చేవెళ్ల పార్లమెంట్‌ అర్భన్‌, సెమీ అర్భన్‌ ప్రాం తంగా ఉంటుంది. రాష్ట్ర రాజధాని శివారు ప్రాం తాన్ని అవరించి ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉం టున్న వారు ఎక్కువగా హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తుంటారు. ఈ ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్న వారు హైదరాబాద్‌లో నివసిస్తుంటారు. రాష్ట్రంలో ఆర్‌టీసీ ఉచిత ప్రయాణాన్ని ఎక్కువగా వినియో గించుకుంటుంది చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలే. ఉచిత ప్రయాణం వీరికి ఎంతో ఉపయో గంగా ఉంది. వీరంతా కాంగ్రెస్‌కు వీరాభిమానుల య్యారు. ఎవరూ అవునన్న కాదన్నా వారు కాంగ్రెస్‌ వైపే మెగ్గు చూపే అవకాశం ఉంది.

Spread the love