నవతెలంగాణ- మల్హర్ రావు: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలో కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి, బిఎస్పీ పార్టీల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా బిఎస్పీ నుంచి మంథని ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగిన చల్లా నారాయణరెడ్డికి మంథని ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం కల్పించాలంటూ నారాయణరెడ్డి తనయుడు చల్లా సాయి కిరణ్ రెడ్డి తన యూత్ బృందంతో గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అణగారిన, బడుగు బలహీన, బహుజనులు అభివృద్ధి చెందాలంటే బిఎస్పీ జాతీయ నాయకురాలు కుమారి మాయావతి, రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లతో సాధ్యమన్నారు. మంథని నియోజకవర్గము అభివృద్ధి చెందాలంటే నారాయణరెడ్డి ఏనుగు గుర్తుకు ఓటువేసి ఆశీర్వదించాలని కోరారు. రోజురోజుకూ బీఎస్పీ పార్టీకి ప్రజాదరణ పెరుగుతుందని భారీ మెజార్టీతో నారాయణరెడ్డి గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం మండలంలో తాడిచెర్ల, కొయ్యుర్, పెద్దతూండ్ల గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, రాగం ఐలయ్య,బొంతల రాజు పాల్గొన్నారు.