
గాడ నిద్రలో ఉన్న కన్నతండ్రిని కడ తీర్చిన ఘటన జైపూర్ మండలం ఇందారం గ్రామంలో గురువారం మధ్య రాత్రి చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న ఆవిడపు రాజన్న తన కుమారుడైన సిద్ధార్థ (సిద్దు) చేతిలో హతమయ్యాడు.. నిద్రిస్తున్న తండ్రిని కత్తితో మెడ కోసి చంపాడు. ఆ తర్వాత సిద్ధార్థ స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. కాగా ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.