నవతెలంగాణ – వనపర్తి
పొద్దస్తమానం కూలినాలు చేసి పనిచేసే రైతులు, ప్రజల రైతులు కూలీలు కార్మికుల చెమట చుక్కల నుండి పాట పుట్టిందని ప్రముఖ వాగ్గేయకారుడు,కవి జయరాజు అన్నారు. శనివారం వనపర్తి పట్టణంలోని దాచా లక్ష్మయ్య ఫంక్షన్లో పట్టాకుపట్టాభిషేకం కార్యక్రమం జరిగింది. ఈ సభకు నిర్వాహక అధ్యక్షులు డి. కృష్ణయ్య అధ్యక్షత వహించారు..తెలంగాణ సాహితి ,ప్రజా నాట్యమండలి, తెలంగాణ రాష్ట్ర జానపద కళా కారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని జడ్పీ చైర్మన్ ఆర్. లోక నాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన హాజరైన జయరాజు మాట్లాడుతూ పాట ప్రకృతిలోని మానవ సంబంధాలను పెంపొందిస్తుందని, ప్రకృతిని అనుసరించే మానవ జీవితాలు ఉంటాయని అన్నారు.కూలీలు పనిచేసేటప్పుడు తమ నోళ్ళ నుండి ఆశువుగా వచ్చిందే పాట అన్నారు .పాట జనచైతన్యాన్ని కదిలిస్తుందన్నారు. పాట వల్ల విప్లవాలు వచ్చాయని, పాట వల్ల రాష్ట్రాలు ఏర్పడ్డాయని అన్నారు .పాట ప్రజల కోసం ఉండాలని ప్రజల కోసమే కవిత్వం రాయాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనందాచారి మాట్లాడుతూ చెమట చుక్కలు చిందించండి రాల్చందే పని జరగదు అన్నారు. చెమట చుక్కల ధారపోసేటప్పుడు పాట పుట్టింది అన్నారు పాట ప్రజల జీవితాలను మేల్కొలిపే విధంగా ఉండాలని ప్రజలలో మానవ సంబంధాలను పెంపొందించే విధంగా ఉండాలన్నారు. కలిసి మెలసి బతుకుతున్న ప్రజల్లో విభేదాలు సృష్టిస్తూ కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు .జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి మాట్లాడుతూ సమాజ సంక్షేమం కాంక్షించే పాట, కవిత్వము గొప్పదని అలాంటి రచయితలను , గాయకులను ఆయన అభినందించారు.ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని దాదాపు 100 మందికి పైగా గాయకులు హాజరై తమ పాటలు వినిపించారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి అధ్యక్ష కార్యదర్శులు వేముల ఆనంద్ కట్టా నరసింహ, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిట శ్రీధర్, ప్రజావైద్యశాల ప్రముఖ డాక్టర్ మురళీధర్ ,జిల్లా బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మోహన్ కుమార్ యాదవ్. తెలంగాణ ప్రజల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మురళీధర్ గుప్తా, తో పాటు జానపద కళాకారుల సంఘం రాష్ట్ర నాయకులు డప్పు స్వామి, మెసేజ్ నిర్వాహకులు గంధం నాగరాజు, రాజా రామ్ ప్రకాష్ చీర్ల నాగేంద్రము కాకమాంజనేయులు భూరోజు గిరిరాజాచారి తదితరులు పాల్గొన్నారు.