
నవతెలంగాణ-బెజ్జంకి
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల సాధనకు ఈ నెల 20న హైదరబాద్ యందు ఎస్ పీడీ కార్యలయం వద్ద తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయాలని టీఎస్ యూటీఎఫ్ కార్యదర్శి గిరిబాబు పిలుపునిచ్చారు.బుధవారం మండల కేంద్రంలోని కేజీవీబీ విద్యాలయాన్ని టీఎస్ యుటీఎఫ్ జిల్లా కార్యదర్శి గిరిబాబు సందర్శించి ఉపాధ్యాయులు, సిబ్బందితో మాట్లాడారు. ధర్నాకు మండలంలోని ఉపాధ్యాయులు, ఉద్యోగ సిబ్బంది హాజరై జయప్రదం చేయాలని గిరిబాబు కోరారు. టీఎస్ యూటీఎఫ్ మండల కార్యదర్శి దుర్గాప్రసాద్, కేజీవీబీ విద్యాలయ బోధన సిబ్బంది పాల్గొన్నారు.