కులవృత్తి దారులకు చెక్కుల పంపిణీలో రాష్ట్రంలోనే ఆదర్శం: స్పీకర్ పోచారం

నవతెలంగాణ – నసురుల్లాబాద్
బీసి కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి ప్రభుత్వం అందించే లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్దిదారులకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. శుక్రవారం నసురుల్లాబాద్ మండల కేంద్రంలో సంక్షేమ సంబరాల కార్యక్రమంలో నసురుల్లాబాద్ మండల పరిధిలోని వివిధ గ్రామాల 10 మంది కుల వృత్తి దారులకు 1 లక్షల రూపాయల చెక్ ను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అందకేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, స్పీకర్ పోచారం మాట్లాడుతూ రాష్ట్రంలొనే ప్రథమం అన్నారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కుల వృత్తిదారులకు చెక్కులు ఇవ్వలేదని రాష్ట్రంలోనే మొట్టమొదటిగా 10 మందికి 100శాతం సబ్సిడీ రుణాలు ఇవ్వడంలో బాన్సువాడ నియోజకవర్గం ఆదర్శం అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, అధికారులు మండల పార్టీ అధ్యక్షుడు పెరకా శ్రీనివాస్ ఎంపీపీ పాల్త్య విఠల్ తదితరులు ఉన్నారు

Spread the love