దుబ్బాక నియోజకవర్గ దళితుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలి

నవతెలంగాణ – దుబ్బాక రూరల్
ఈనెల 4న జరిగే దుబ్బాక నియోజకవర్గ దళిత ఆత్మీయ సమ్మేళనానికి దళితులు పెద్ద ఎత్తున తరలిరావాలని అక్బరుపేట భూంపల్లి మండల అధ్యక్షులు జీడిపల్లి రవి పిలుపునిచ్చారు. మంగళవారం అక్బరుపేట్ భూంపల్లి మండలంలోని ఎస్బీఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన  విలేకర్లసమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో దుబ్బాక నియోజకవర్గ దళిత సమ్మేళన కమిటీ వారి వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దళితుల ఐక్యతను, చాటి చెప్పాలని సూచించారు.ఎస్బీఆర్ గార్డెన్ లో 4నజరిగే సమావేశానికి మంత్రి హరీష్ రావు,మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి దళితులంతా తరలివచ్చి ,విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ దళిత ఆత్మీయ సమ్మేళన కమిటీ అధ్యక్షులు అస యాదగిరి, గౌరవ అధ్యక్షులు కరికే శ్రీనివాస్ ర్యాకం శ్రీరాములు, విజిలెన్స్ కమిటీ మెంబర్ యెరుమని దుబ్బరాజం పాస్తo. వెంకటేష్ కన్వీనర్స్ కో కన్వీనర్స్. చారువక కుమార్ , ఏకలవ్య సంఘ అధ్యక్షుడు వనం రమేష్ అక్బర్పేట్ భూంపల్లి మండల అధ్యక్షులు జీడిపల్లి రవి దళిత సర్పంచులు ఎంపీటీసీలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము కాల్వ నరేష్ వైఎస్ చైర్మెన్ మార్కెట్ కమిటీ వైస్ చేర్మెన్ చెక్కపల్లి పద్మయ్య టెలికం బోర్డు మెంబర్ సుధీర్,స్థానిక అక్బరుపేట్ భూంపల్లి ఇంఛార్జి. మండలయాదగిరి రామేశ్వరం పల్లి కుమార్, ఎస్సిసెల్ మండలఅధ్యక్షులు బోరం రాజేశ్వర్ బొరేం యాదగిరి బత్తుల కుమార్ సంఘాల నాయకులు,కౌన్సిలర్ లు అస స్వామి, బత్తుల స్వామి పెరక మధు, భూపాల్,బిట్ల యాదగిరి అస రవి ఎడమైన లక్ష్మణ్, ఎర్రోళ్ల రాజు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Spread the love