కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతులకు పెద్దపీట వేసిందని తాడిచెర్ల ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ ఇప్ప మొoడయ్య అన్నారు. శనివారం మండల కేంద్రమైన తాడిచెర్ల పిఏసిఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్ర బడ్జెట్లో ఎన్నడు లేని విధంగా 25 శాతం నిధులు వ్యవసాయానికి కేటాయించడం హర్షించదగిన విషమన్నారు. గత ప్రభుత్వం రుణమాఫీకి బడ్జెట్ కేటాయించి ఖర్చు చేయలేదన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు ధాన్యానికి రూ.500 బోనస్ ప్రకటించినందుకు రైతుల పక్షాన సీఎం రేవంత్ రెడ్డి,,ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క,ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ మల్కా సూర్య ప్రకాష్ రావు,సింగిల్ విండో డైరెక్టర్లు వొన్న తిరుపతి రావు,సంగ్గెం రమేష్,సర్వా నాయక్ పాల్గొన్నారు.