నవతెలంగాణ – తాడ్వాయి
మేడారంలో పారిశుద్ధ్య పనులు పొగడ్బందీగా చేపడుతున్నట్లు జిల్లా జిల్లా యంత్రాంగం చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. 4000 పైగా మంది స్పర్శ కార్మికులను వినియోగించుకుంటున్నామని చెప్పారు. మేడారం జాతరలో ఎక్కడ చూసినా చెత్తాచెదారం కుళ్ళిన పదార్థాలు జంతువుల కళేబరాలు దుర్వాసనలతో మేడారం మొత్తం దుర్గంధం గా మారింది. మేడారం దాని చుట్టూ గ్రామాల పరిస్థితి అద్వానంగా మారి, దుర్వాసన వెదజల్లుతుంది. సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతోనే పారిశుధ్యం పడకేసిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంటనే మేడారంలో దాని పరిసర గ్రామాలపై పారిశుద్ధ్య ప్రభావం లేకుండా పారిశుద్ధ్యన్ని తొలగించి ఈగల్ దోమలు వ్యాప్తి చెందకుండా అంటూ రోగాలు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని స్థానిక గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు.