కథ ముగిసింది

– సెమీస్‌లో ఓడిన గాయత్రి జోడీ
– ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌
బర్మింగ్‌హామ్‌: స్టార్‌ షట్లర్లు నిరాశపరుస్తున్నా.. సెమీఫైనల్స్‌కు చేరుకుని ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌లో టైటిల్‌ ఆశలు రేపిన యువ జోడీ కథ ముగిసింది. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి, ట్రెసా జాలీ జంట సెమీఫైనల్లో పోరాడి ఓడింది. వరుస గేముల్లో దక్షిణ కొరియా జోడీ భారత జంటపై విజయం నమోదు చేసింది. 10-21, 10-21తో 46 నిమిషాల్లోనే ఫైనల్స్‌ బెర్త్‌ను ప్రత్యర్థికి కోల్పోయారు గాయత్రి, ట్రెసా. మంచి అంచ నాలతో సెమీస్‌ సమరానికి వచ్చిన గాయత్రి, ట్రెసా జంట రెండు గేముల్లోనూ నిరాశపరిచారు. అంచ నాలను అందు కోలేకపోయారు. తొలి గేములో 6-11తో విరామ సమయానికి భారీ వెనుకంజ వేసిన గాయత్రి, జాలీ జంట మళ్లీ పుంజుకోలేదు. రెండో గేమ్‌లో సైతం గాయత్రి, ట్రెసాలు ఏమాత్రం పుంజుకోలేక పోయారు. 1-1 తర్వాత ఏ దశలోనూ దక్షిణ కొరియా అమ్మాయిలను అందు కోలేక పోయారు. 4-11తో బ్రేక్‌ సమ యా నికి వెనుకంజ వేసిన మనోళ్లు.. ద్వితీ యార్థంలోనూ చతికిల పడ్డారు. ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్లో అడుగుపెట్టే చారిత్రక అవకాశాన్ని చేజార్చుకున్నారు.

Spread the love