కథ, కథనాలే హైలెట్‌

The story and the stories are the highlightఎం.కె.ఎ.కె.ఎ ఫిలిం ప్రొడక్షన్‌ సమర్పణలో బాబా పి.ఆర్‌. దర్శకత్వంలో మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌ నిర్మించిన చిత్రం ‘అష్టదిగ్బంధనం’. సూర్య, విషిక జంటగా నటించిన ఈ చిత్రం ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు బాబా పి.ఆర్‌. మాట్లాడుతూ, ‘అష్టదిగ్బంధనం’ అనే పవర్‌ఫుల్‌ టైటిల్‌కి తగ్గట్టు దాన్ని జస్టిఫై చేసేలా ప్రతి అంశంలో జాగ్రత్తలు తీసుకున్నాం. అలాగే ఇందులోని ప్రతి క్యారెక్టర్‌ అవతలి వారిని అష్టదిగ్బంధనం చేయాలని చూస్తుంటారు. ఇలా పలువురు వ్యక్తుల స్వార్ధంతో కూడిన జీవితాలకు సంబంధించినదే ఈ కథ. ఇది యాక్షన్‌, థ్రిలర్స్‌ను ఎక్కువగా ఇష్టపడే వారికి బాగా కనెక్ట్‌ అవుతుంది’ అని అన్నారు. ‘ఇది స్క్రీన్‌ప్లే బేస్డ్‌ సినిమా. ఈ కథ వినగానే చాలా ఎగ్జైట్‌ ఫీలయ్యా. ఇలాంటి కథతో నిర్మాతగా మారుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్రేక్షకులను ‘అష్టదిగ్బంధనం’ చేసే కథ, కథనాలే ఈ సినిమాకి హైలెట్‌. మా సినిమాకి బిజినెస్‌ సైడ్‌ నుంచి రెస్పాన్స్‌ చాలా బాగుంది. ఆంధ్ర, తెలంగాణల్లో దాదాపు 150 నుంచి 200 థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం మా బ్యానర్‌లో ఒక సినిమా సెట్స్‌ మీద ఉంది. త్వరలో దాని వివరాలు తెలియజేస్తాం’ అని నిర్మాత మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌ చెప్పారు.

Spread the love