ఆవారాకుర్రాళ్ళకథ

బిగ్‌ బాస్‌ శ్రీహాన్‌, ముక్కు అజరు, ఢ చెర్రీ, జస్వంత్‌, షియాజీ షిండే నట ీనటులుగా దేపా శ్రీకాంత్‌ రెడ్డి దర్శకత్వంలో విభా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత నంద్యాల మధుసూదన్‌ రెడ్డి నిర్మించిన చిత్రం ‘మా ఆవారా జిందగీ’. ఈ చిత్రానికి కంభంపాటి విజరు కుమార్‌ సహ నిర్మాతగా వ్యవహరించగా, ప్రతీక్‌ నాగ్‌ సంగీతం అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నేడు (శుక్రవారం) గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా చిత్ర యూనిట్‌ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. దర్శకుడు దేపా శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘హైదరాబాద్‌లో నలుగురు ఆవారా కుర్రాళ్ల పనులు ఎలా ఉండబోతున్నాయి?, ఆ పనులకు కామెడీ ఎలా లింక్‌ చేశారు? అనే ఫన్‌ ఓరియెంటెడ్‌, యూత్‌ ఫుల్‌ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రమిది’ అని అన్నారు.బిగ్‌ బాస్‌ ఫే˜మ్‌ శ్రీహన్‌ మాట్లాడుతూ, ‘ఇలాంటి బోల్డ్‌ కంటెంట్‌ సినిమా చేయాలంటే ధైర్యం ఉండాలి. మంచి ఎంటర్టైన్మెంట్‌తో వస్తున్న ఈ సినిమాలోని మా నటనకు ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఫుల్‌ ఎంటర్టైన్‌ అవుతారని కచ్చితంగా చెప్పగలను’ అని చెప్పారు. చెర్రీ మాట్లాడుతూ, ‘ఒక డ్యాన్సర్‌గా లైఫ్‌ స్టార్ట్‌ చేసిన నాకు మా చిట్టి మాస్టర్‌ ద్వారా ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. మా సినిమాను చూసి ప్రేక్షకులు అందరూ బిగ్‌ హిట్‌ చేయాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ‘ఈ సినిమా ఆవారా తనానికి, పోరంబోకు తనానికి పరాకాష్ట అని చెప్పవచ్చు. ఇందులో నటించిన పోరగాళ్లు ఎంతో అల్లరి చేశారు. దర్శకుడు శ్రీకాంత్‌ కూడా యూత్‌కి కనెక్ట్‌ అయ్యే సీన్స్‌ చాలా బాగా తీశాడు. ఇందులో శ్రీహాన్‌కు ఫాదర్‌గా నటించాను. ఈ సినిమా చూసిన తర్వాత నన్ను ఆవారాకి ఫాదర్‌ అనేలా ఉంటుంది. యూత్‌ అందరూ కచ్చితంగా ఎంటర్టైన్‌ అవుతారు’ అని నటుడు మహేందర్‌ నాథ్‌ చెప్పారు.

Spread the love