ఇండ్లస్థలాల పోరు తీవ్రం

The struggle for household space is intense– ఎర్రజెండా చేతబూని ఏకమైన పేదలు
– గుడిసె దక్కేవరకు పోరాటం : తెలంగాణ ప్రజాసంఘాల పోరాట కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ వీరయ్య
– ములుగు ‘వాజేడు’లో కొనసాగుతున్న ఆందోళన
నవ తెలంగాణ విలేకరి-వాజేడు
ములుగు జిల్లా వాజేడు మండలం పూసురు గ్రామంలో గుడిసెవాసుల పోరాటం తీవ్రమవుతున్నది. గుడిసెవాసుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజులుగా ఈ పోరాటం నడుస్తున్నది. ఎర్రజెండా చేతబూని వందలాది పేదలు ఆ ప్రాంతంలో ఏకమయ్యారు. నినాదాలు, పాటలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. తెలంగాణ ప్రజాసంఘాల పోరాట కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌. వీరయ్య పోరాట కేంద్రాన్ని బుధవారం సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ ‘పేదలకు ఇవ్వాల్సిన ఇంటి స్థలాలకు స్థలం లేదు.. కార్పొరేట్లకు మాత్రం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉచితంగా భూములు కేటాయిస్తున్నది’ అని విమర్శించారు. ‘రాష్ట్ర వ్యాపితంగా 65 కేంద్రాల్లో భూపోరాటం జరుగుతున్నది… మీకు అండగా వేలాది మంది గుడిసె వాసుల మద్దతు ఉంది. మీరు ఒంటరి వాళ్ళు కాదు’ అని పేదలకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వ స్థలం పేదోడికి ఇవ్వలేకుంటే ఆ భూమి ఎందుకని ప్రశ్నించారు. పోరాడితే పోయేదేమి లేదని, పోరాటం చేసేవారికి ఎర్రజెండా అండగా ఉంటుందని అన్నారు పేదల బాగోగులు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, కానీ కల్లబొల్లి మాటలతో కాలం వెల్లదీయడం సరికాదన్నారు. వాజేడు మండలంలో వేయి మంది పేదలు గుడిసలు వేసుకున్నారంటే..ఇంటి స్థలాలు సమస్య ఎంత ఉందో అర్ధమవుతుందని అని అన్నారు. గుడిసెలు తొలగించాలని ఆలోచన చేస్తే ఊరుకోబోమని, రాష్ట్ర వ్యాపిత ఉద్యమంగా మలుస్తామని అధికారులను హెచ్చరించారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, మల్లు స్వరాజ్యం, పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి, బీరెడ్డి సాంబశివా, మండల కార్యదర్శి కొప్పుల రఘుపతిరావు, జిల్లా కమిటి సభ్యులు గ్యానం వాసు, కృష్ణబాబు దేవయ్య, సౌమ్య దామోదర్‌, కృష్ణబాబు, సంతోష్‌, కుమారి ముత్తయ్య బాబురావు, తదితరులు పాల్గొన్నారు.
పేదలకు గుడిసెలు దక్కేవరకూ పోరాడుతాం…
ప్రజాసంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌ వీరయ్య
నవతెలంగాణ-వాజేడు
పేదలకు గుడిసెలు దక్కేవరకూ పోరాడాలని ప్రజాసంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌ వీరయ్య గుడిసెవాసులకు పిలుపునిచ్చారు. ములుగు జిల్లా వాజేడు మండలం పూసురు రెవెన్యూ గ్రామంలో మూడు రోజులుగా గుడిసెవాసులు చేపట్టిన పోరాటాన్ని బుధవారం వీరయ్య సందర్శించి మాట్లాడారు. పేదల ఇంటి స్థలాలకు స్థలం లేదంటున్న ప్రభుత్వం.. కార్పొరేట్‌ శక్తులకు ఉచితంగా ఇవ్వడానికి మాత్రం స్థలం ఉందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 కేంద్రాల్లో భూపోరాటం జరుగుతుందన్నారు. వేలాది మంది గుడిసెవాసులు ఎర్రజెండా అండతో పోరాడాలని, వారి అండగా ఉంటామని స్పష్టంచేశారు. పేదల బాగోగులు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నా.. గుడిసెలకు ఇంటి జాగా అడిగితే రెవెన్యూ అధికారులు పోలీసులతో ఖాళీ చేయాలని బెదిరింపులకు పాల్పడటం సరి కాదన్నారు. వాజేడు మండలంలో వెయ్యి మంది పేదలు గుడిసెలు వేసుకున్నారంటే.. ఇంటి స్థలాల సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్ధమవుతుందన్నారు. గుడిసెలు తొలగించాలని యత్నిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, మల్లు స్వరాజ్యం.. పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి, బీరెడ్డి సాంబశివ, మండల కార్యదర్శి కొప్పుల రఘుపతిరావు, జిల్లా కమిటీ సభ్యులు గ్యానం వాసు, కృష్ణబాబు, దేవయ్య, సౌమ్య, దామోదర్‌, కృష్ణబాబు, సంతోష్‌, కుమారి ముత్తయ్య బాబురావు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love