– పూటకో పార్టీ మార్చే అభ్యర్ధులను ఓడించండి..
– ప్రజా సమస్యలపై పోరాడే కమ్యునిస్టు అభ్యర్ధులను గెలిపించండి..
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ- అశ్వారావుపేట: అధికారమే పరమావధిగా గెలవడానికి ఓ పార్టీలో చేరి,అధికారం చలాయించడానికి మరో పార్టీలో చేరే పూటకో పార్టీ మార్చే అభ్యర్ధులను చిత్తు చిత్తు గా ఓడించి,నిరంతరం ప్రజా సమస్యలు పై పోరాడే కమ్యునిస్టు అభ్యర్ధులను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరం కనకయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా సంఘాలు బలపరిచిన సీపీఐ(ఎం) అభ్యర్ధి అర్జున్ రావు పిట్టల విజయాన్ని కాంక్షిస్తూ గురువారం మండలంలోని కన్నాయిగూడెం, మల్లాయిగూడెం, పండువారి గూడెం పంచాయితీల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పోడు కు పట్టాలు ఇచ్చామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఘనత సీపీఐ(ఎం) పోరాటం ఫలితమే నని చెప్పడం మరిచిపోతున్నారని ఎద్దేవా చేసారు.అశ్వారావుపేట నుండి ఆదిలాబాద్ వరకు వామపక్షాలు ఆద్వర్యంలో నిర్వహించిన నిర్బంధం ఫలితంగా నే సిఎం కేసీఆర్ పట్టాలు ఇచ్చారని గుర్తు చేసారు. ఈ రెండు పంచాయితీల్లో అత్యధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గం సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, లిక్కి బాలరాజు, అభ్యర్ధి పిట్టల అర్జున్,మండల కార్యదర్శి చిరంజీవి, మండల కమిటీ సభ్యులు మడకం గోవిందు, సోడెం ప్రసాద్, మడిపల్లి వెంటేశ్వరరావు, కోర్సం పెంటా రావు, సోడెం బాబూరావు, శ్రీవేణు లు పాల్గొన్నారు.