నేడు కేయూ బంద్​కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు

నవతెలంగాణ – హైదరాబాద్: కాకతీయ యూనివర్శిటీలో గత కొన్నిరోజులుగా పీహెచ్​డీ ప్రవేశాల్లో అవకతవకలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఓవైపు పీహెచ్​డీ కేటగిరి-2 ప్రవేశాల్లో అక్రమాలపై నిరసన తెలుపుతుంటే మరోవైపు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కొట్టారని ఆరోపిస్తూ 6 రోజులుగా విద్యార్థులు దీక్షలు చేస్తున్నారు. కేటగిరి-2లో అన్ని విభాగాల్లో ఖాళీలను గుర్తించి మెరిట్‌ ప్రకారం రెండో జాబితా ప్రకటించి అడ్మిషన్లు జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు. విద్యార్థులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవటంతో పాటు రిజిస్ట్రార్‌ని తక్షణమే తొలగించాలని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కేయూతో పాటు జిల్లా బంద్​కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు బీజేపీ, కాంగ్రెస్‌ సహా ఇతర పార్టీల సంఘీభావం తెలిపాయి.

Spread the love