మళ్లీ పెరిగిన ఎండలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో రెండు రోజులుగా చల్లబడిన వాతావరణం మళ్లీ వేడెక్కింది. ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగాయి. చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటాయి. ఈ వారంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో అత్యధికంగా 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా చిరుజల్లులు పడే అవకాశముంది.

Spread the love