నవతెలంగాణ – ఢిల్లీ: ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను వసూలుకు అనుసరిస్తున్న టీడీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఓ వ్యక్తి సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనివల్ల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. అయితే, ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలంటూ సుప్రీంకోర్టు పిటిషనర్‌కు సూచించింది.