కార్మికుల శ్రమ వలన వచ్చే అదనపు విలువ పంపిణీ జరగాల్సిందే..

– 8 గంటల పని దినాలను 12 గంటలకు పెంచి కార్మికులకు ద్రోహం చేసింది కేంద్ర ప్రభుత్వం
నవతెలంగాణ – చివ్వేంల
కార్మికులు తమ రక్తం దార పోసి శ్రమిస్తే వచ్చే అదనపు లాభం ద్వారానే పెట్టుబడుదారులు సంపద పోగేస్తున్నారని కార్మికుల అదనపు విలువ పంపిణీ జరగాల్సిందేనని సిపిఎం మండల కార్యదర్శి బచ్చల కూర రామ్ చరణ్ అన్నారు. బుధవారం  చివ్వేంల  మండల కేంద్రంలోపాటు,ఉండ్రుగొండ, వల్లభాపురం, తిమ్మాపురం, గుంపుల  గ్రామాలలో  138 వ మే దినోత్సవం  సందర్భంగా సిపిఎం జెండా ఆవిష్కరించి మాట్లాడటం జరిగింది.   పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని రద్దుచేసి కేంద్ర ప్రభుత్వం 12 గంటల పని దినం తీసుకురావడం అంటే శ్రామికుల శ్రమను దోపిడి చేయడమేనని పెట్టుబడుదారుల కొమ్ముగాయడమేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షకుల జీవితాలతో చలగాటమాడుతుందని అన్నారు. మే దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా ఉందనడానికి నిదర్శనం ఉపాధి హామీ పనులను కూడా ఈరోజు నడిపించడం అన్యాయమన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో మత ఉన్మాద బిజెపి నీ ఓడించాలన్నారు. పలు  కార్యక్రమాలలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బానోతు వినోద్ కుమార్, సిపిఎం మండల కమిటీ సభ్యులు నాచపోయిన భూసయ్య, తుడుసు సోమయ్య, జటంగి వెంకన్న, కొల్లూరి బాబు, బొప్పాని సులేమాన్, సీఐటీయూ  నాయకులు అమ్మయ్య , ఏసు, లక్ష్మణ్, నవీన్, రవి, నాయకులు బలుగూరి వెంకన్న, దుర్గయ్య, వీరయ్య, లింగయ్య, బచ్చలి కన్నయ్య,తదితరులు పాల్గొన్నారు.
Spread the love