ఉపాధ్యాయుడు ఉదయ్…

అది పివి నగర్ గ్రామం ఆ గ్రామంలో 40 ఆదివాసి కుటుంబాలు ఉంటాయి .ఆ ఊరికి పక్కనే ఉత్తరాన తేనేటి సెలయేరు లాగ పారే బొగ్గుల వాగు ఉంటుంది. దక్షిణాన అడవి ప్రాంతం గుండా వచ్చే హైవే రోడ్డు ఉంటుంది. ఆ గ్రామం ఒకప్పుడు దట్టమైన అడవి మధ్యలో ఉండేది.
ప్రస్తుతం కూడా చుట్టూత అడవి ఉంటుంది. కానీ నాటి తీగదారి పొదలు, కంకవనాలు, టేకు వనాలు, ఇప్పుడు కానరావు. తూర్పు వైపున ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడవిని నరికి నీలగిరి మొక్కలు నాటారు. అవి పెరిగాక నరికి అమ్మేసి ఆ ఆదాయం ప్రభుత్వాలకు ముట్ట చెపుతారు. ఆ ఆదివాసులు చాలాకాలం అడవి మీదనే ఆధారపడి బ్రతికేవారు. తేనె తీయడం, గడ్డలు తవ్వుకచ్చి అమ్ముకోవడం, పక్కనే ఉన్న మానేరు వాగు, బొగ్గుల వాగులో చేపలు పట్టడం, కొంతమంది పక్కనే ఉన్న వళ్ళేంకుంట గ్రామానికి కూలికిపోయి వచ్చిన డబ్బుతో జీవనం గడిపేవారు. ప్రస్తుతం వారి జీవన విధానంలో కొంత మార్పు వచ్చింది. నాటి పనులు దొరకడం లేదు. ప్రపంచీకరణ ప్రభావం తో వారి జీవన విధానంలో కూడా మార్పులు వచ్చాయి. దాదాపు ఆ గ్రామంలో కొన్ని కుటుంబాలలో టి.వి.లు చొరబడ్డాయి.ప్రస్తుత జనరేషన్ యువతీ ,యువకులు శ్రమకు దూరమవుతున్నారు. నాటికంటే ఇప్పుడే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామం చుట్టూ ఉన్న సుమారు 300 ఎకరాల భూమిలో కొంత భాగాన్ని ఆర్ధిక అవసరాల రీత్యా గిరిజనేతర కుటుంబాలకు అమ్ముకున్నారు.ఈ పీవీ నగర్ గ్రామ సమీపంలో ఉత్తరం వైపున వల్లెంకుంట గ్రామం ఉంటుంది. ఈ గ్రామానికి పివి నగర్ గ్రామానికి ప్రజా సంబంధాలు ఎక్కువగానే ఉంటాయి. ఒకప్పుడు ఈ గ్రామాలు అన్నీ చైతన్యానికి, ఉద్యమాలకు ఉవ్వెత్తున ఎగిసి పడిన అనుభవాలు ఉన్నవి .వల్లెంకుంట గ్రామానికి చెందిన ప్రభుత్వ టీచర్ ఉదయ్ కిరణ్ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నాడు. 2014 ముందు తెలంగాణ ఉద్యమంలో ఎగిసిపడిన పల్లెల్లో పివి నగర్ వల్లంకుంట గ్రామాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో నే, ఉపాధ్యాయుడు ఉదయ్ కి పి.వి. నగర్ గ్రామంలోని కుటుంబాలకు ఉద్యమం కంటే ముందే బాగా పరిచయాలు ఉన్నాయి. గ్రామాల్లోని కుటుంబాలకు ఈ ఉదయ్ మీదవిశ్వాసంచాలా ఉంటుంది. ఏది చెప్పినా ,చేసినా నలుగురు కి ఉపయోగ పడేలా చెప్తాడు, చేస్తాడు అని అంటుంటారు.
అవి శీతా కాలం రోజులు. తెల్లని వెన్నెల కాస్తుంది. ఆ వెన్నెల కాంతుల్లో మంచి బిందువుల నేల రాలుతున్నవి. ఆ పివి నగర్ గ్రామంలో కొంతమందికి పూరి గుడిసెలు ,కొంతమందివి పెంకుటిల్లు. చలి నుండి కాపాడుకోవాలంటే ప్రతి ఇంటి కి నేగడి ఉండాల్సిందే. పొద్దంతా పనిచేసోచ్చి అలసిపోయి తొందరగా నే నిద్రలోకి జారుకున్నప్పటికీ తెల్లవారుజామునే మెలకువ వచ్చి నేగల్ల (చలిమంట ) ముందర కూర్చున్నారు.ఆ గ్రామంలోకొంత చైతన్యమున్న వ్యక్తులుగా బొడ్డు లచ్చయ్య,జంగా నారాయణలకుపెరు ఉంటుంది.ఆది ఆదివారం రోజు ,తెల్లవారుజామునే బొడ్డు లచ్చులు నేగడి ముందట కూర్చొని చలి కాగుతున్నాడు. జంగ నారాయణ ఇల్లు కూడా పక్కనే ఉంటుంది. కాబట్టి ఇదే నెగడి దగ్గరికి వచ్చి చేరాడు.నెగడి చుట్టూ ఈ ఇద్దరితో పాటు సడవలి, రాములు, నాగరాజు, మహేందర్లు కూర్చున్నారు.
అరే నారాయణ ,ఆ టీచర్ ఉదయ్ బావ ,ఈరోజు మనందరినీ కొయ్యూరు కు, ధర్నాకు రమ్మని చెప్పిండు, గుర్తుందా?మాట్లాడాడు బొడ్డు లచ్చులు. నిజమే రమ్మన్నాడు, పాపం ఆ అన్నకు ఏమొస్తదో ఏమో! చిన్నప్పటినుండి కూడా మన లాంటి వాళ్లు గురించే ఆలోచిస్తూ ఉంటాడు.నారాయణ. ఇప్పుడు మన ఊరు చుట్టూతా ఉన్న ఈ 300 ఎకరాలలో ఉన్న చెట్లన్ని కొట్టించింది కూడా ఆ భావనే. లచ్చులు. అవును ఆ రోజు రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి మాట్లాడి చుట్టూ ఉన్న భూముల్లో ఉన్న చెట్లన్ని నరికియ్యడానికి ఎంపీడీవో కిషన్ తోని మాట్లాడిన ఈ రెండు రోజుల్లో పని ప్రారంభం అవుతుందని చెప్పాడు లచ్చులు. ఆ రాత్రి కూడా మన గురించే
ఆలోచించాడు. నారాయణ ఆ పని ప్రారంభం అయ్యి పొదలన్ని లేకుండా చేసేవరకు విడిచి పెట్టేది లేదు అన్నాడు లచ్చులు.
ఆ పని నడుస్తుంటే ఎంపీడీవో సార్ కూడా మాట్లాడుతూ టీచర్ ఉదయ్ అనే అబ్బాయి ఎవరు నాకు ఫోన్ లోనే పరిచయం అయ్యిండు
రాత్రి 11:30 నిమిషాలకు ఫోన్ చేసి సి ఎల్ డి పి (కాంప్రెన్సివ్ లాండ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం) కింద పివి నగర్ భూములను పెట్టండి అని చెప్పాడు. మా పి.డి గారికి కూడా ఆ అబ్బాయి స్నేహితుడట అని చెప్పిండు అన్నాడు నారాయణ. ఆ పెద్ద సారు, ఉదయ్ ,బావ ఇద్దరూ స్నేహితులమని ఆ పెద్ద సారు కూడా నాతోనే అన్నాడు. లచ్చులు. సరే, తెల్లవారుతోంది అసలు విషయం చెప్పు నారాయణ మన ఊరోళ్ళు అందరిని కొయ్యూరు రమ్మన్నాడు ఏదో తెలంగాణ మీటింగ్ ఉన్నదటఁ లచ్చులు.
ఆ విషయం నాకు కూడా చెప్పిండు, మన తెలంగాణ వస్తే మనకు కూడా లాభం జరుగుతదట, నారాయణ.
అది 2018 సంవత్సరం ప్రత్యేక తెలంగాణ ఏర్పడి నాలుగు సంవత్సరాలు గడిచింది. తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిశోధక విద్యార్థులు, పీజీ విద్యార్థులు, సామాజిక స్పృహ కలిగిన వారందరూ ఒక సంఘంగా మంథని ప్రాంతంలో అన్ని గ్రామాల్లో మీటింగ్లు పెడుతూ వస్తున్నారు. అందులో భాగంగానే వల్లెంకుంటలో కూడా ఒక మీటింగ్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ మీటింగ్ కు హాజరు కావాలని పివి నగర్ గ్రామస్తులకు కూడా సమాచారం ఇచ్చారు. సాయంత్రం ఏడు గంటలు కావస్తుంది. గ్రామపంచాయతీ దగ్గర అందరూ పీవీనగర్ ఆదివాసులు కూడా హాజరయ్యారు. ఒక విద్యార్థి బృందం కంజర్ల వాయిస్తూ తెలంగాణలో జరుగుతున్న దోపిడిని వివరిస్తూ పాట పాడుతుంటే, గ్రామస్తులు కూడా గొంతు కలుపుతున్నారు .ఆ బృందం నుండి దీపక్ అనే విద్యార్థి మాట్లాడటం మొదలుపెట్టాడు. తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు మాకే దక్కుతాయని, మా వనరులు మాకే చెందుతాయని, మా సంపద మాకే దక్కుతుందని, విద్యా వైద్యం అందుతాయని, మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని, అనేక రకాల డిమాండ్లతో మనం తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్నాం,కాని నేడు జరుగుతున్నది ఈ డిమాండ్లకు విరుద్ధంగా నేడు పాలన జరుగుతున్నది., లక్షలాది ఉద్యోగాలు గాలికి వదిలేశారు. మాలాంటి విద్యార్థులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నం. నాడు కేజీ టు పీజీ విద్య ఉచితం అని చెప్పి నేడు డబ్బున్నోడికే చదువు అన్న చందంగా ఉంది. కాబట్టి ప్రజలారా మనమంతా మరో ప్రజాస్వామిక తెలంగాణ డిమాండ్తో పోరాటం చేస్తే తప్ప మనందరిలో మార్పు రాదు అని చివరకు ముగించాడు.
మీటింగ్ పూర్తయింది .ఎటువాళ్లు అటు వెళ్లిపోయారు. ఈ పివి నగర్ వాసులు కూడా వెళ్లిపోయారు. తెల్లారింది ఎవరి పనుల్లో వారు నియజ్ఞం అయ్యారు. నెల గడిచింది.ఉపాధ్యాయుడు ఉదయ్ కరీంనగర్లో నివాసం ఉంటున్నాడు. రాత్రి 12 గంటలు అవుతుంది. ఉదయ్ నిద్రలో ఉన్నాడు. సెల్ఫోన్ 5 ,6 సార్లు మోగింది. ఎవరు అని ఫోన్ చూస్తే ఎవరో చాలా సార్లు చేస్తున్నారు. అని లేచి ఫోన్ టచ్ చేసి మిస్డ్ కాల్ చూస్తే బొ డ్డు లచ్చులని పేరు. వెంటనే ఆ నెంబర్కు ఫోన్ చేశాడు
ఫోన్లో మామయ్య మామయ్య అంటూ ఏడుస్తూ బొంగురు పోయినగొంతుతో మాట్లాడుతున్నాడులచ్చులు కొడుకు మహేందర్ ,ఁఏందిరా మహేందర్ ఎందుకు ఏడుస్తున్నావ్ ఏమైంది అని ఓదార్పుగా అడిగాడుఁ ఉదయ్. ఏం లేదు మామయ్య నాన్న చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. మంథని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తే వాళ్ళు కరీంనగర్ చెల్మెడ ఆసుపత్రికి రాశారు అని ఏడుస్తూ మాట్లాడాడు.
అడ్మిట్ చేశారా లేదా అనిఅడిగాడు ఉదయ్.
అడ్మిట్ చేసుకోవడా నికిచాలా ఇబ్బంది అయింది.వీళ్ళు సరిగ్గా పట్టించుకోవడం లేదు, మాకంటే వెనుక వచ్చిన వాళ్ళని తొందరగా అడ్మిట్ చేసుకున్నారు. కానీ మమ్మల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు మావయ్య బాధతో మాట్లాడాడు మహేందర్.మ
హేందర్ నువ్వు బాధపడకు నేను వస్తున్న ఒక అరగంటలో ఆసుపత్రిలో ఉంటా, అని ఫోను పెట్టి వెళ్ళాడు ఉదయ్.
పోయేసరికి జనరల్ వార్డులో బెడ్ మీద ఉంచారు. ఒక్కసారిగా బొడ్డు లచ్చులు ను చూసేసరికి కళ్ళల్లో నీళ్లు ఉబికి వచ్చాయి.
అతన్ని చూస్తే గుర్తుపట్టే స్థితిలో లేడు, అయ్యా , అయ్యా టీచర్ మామయ్య వచ్చిండే లేవవే అని భుజాలను తట్టి ఊపిన కొద్దిసేపటికి కళ్ళు తెరిచి ఉదయ్ వైపు చూడగానే కళ్ళల్లో నుండి దారులు కారుతున్నాయి .వెంటనే ఉదయ్ లచ్చులు చేయి పట్టుకొని, లచ్చులు నేను ఉన్న ,నీవు ఏడవకు నీకు ఏమి కాదు, అని ఎంతో ఓదార్పుగా మాట్లాడిన దారలు ఆగడం లేదు. కొద్దిసేపటికి ఉదయ్ కళ్ళల్లో నుండి కూడా నీటి బిందువులు రాలాయి. కర్చీఫ్ తోతుడ్చికొని డ్యూటీ డాక్టర్ దగ్గరికి నడిచాడు. డాక్టర్ గారు పేషెంట్ కండిషన్ ఏమిటి అని అడిగాడు ఉదయ్, ఇప్పుడే ఎం చెప్పలేమండి చాలా సీరియస్ గానే ఉంది రేపు సాయంత్రం కల్లా ఏమైనా చెప్పొచ్చు అన్నాడు డాక్టర్. వాళ్ళు ఆదివాసులండి చాలా మంచివారు ఎలాగైనా బ్రతికించండి సార్ ,ఉదయ్.
మా ప్రయత్నం మేము చేస్తున్నామండీ పూర్తిగా మీదికోచ్చినంక వచ్చారు, జ్వరం ప్రారంభమైనప్పుడే వస్తే ఇలా జరిగేది కాదు, డాక్టర్ .అసలు డిసీజ్ ఏంటండి ఉదయ్.
ప్లేట్ లేట్స్ పూర్తిగా తగ్గి పోయి లోపల ఆర్గాన్స్ అన్ని చెడి పోయి ఉన్నాయిఅన్నాడు డాక్టర్.ఇంకా ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా?,ఉదయ్. మాప్రయత్నం మేము చేస్తాము. రేపు సాయంత్రం కల్లా క్లారిటీ వస్తుంది ప్రస్తుతం ట్రీట్మెంట్ నడుస్తుంది అన్నారు డాక్టర్.
అక్కడి నుండి లేచి ఉదయ్ లచ్చులు బెడ్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు లచ్చులు పూర్తిగా అపస్మారక స్థితిలోకి ఉన్నాడు ఒకవైపున లచ్చులు కొడుకు మహేందర్ దిక్కుతోచని స్థితిలో ఉదయ్ వైపు చూస్తున్నాడు, పాపం చేతిలో చిల్లిగవ్వలేదు ,కానీఅర్ధం కానివ్వట్లేదు ఇద్దరు కూడా లచ్చులు వైపు చూస్తూ ఒకరి మొఖం ఒకరు చూసుకుంటున్నారు. మహేందర్ ఉదయ్ .అప్పటికి రాత్రి 2.00గం. కావస్తుంది.
చేతికి సెలూన్ పెట్టి సెలూన్ బాటిల్ ని ఎక్కిస్తున్నారు. ఉదయ్ లేచి మళ్లీ డ్యూటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు .డాక్టర్ గారు ఎలాగైనా పేషెంట్ ను బ్రతికించాలండి .వాళ్లు ఆదివాసులు ఇలాంటి వాళ్లను బ్రతికించుకుంటేనే ఒక మంచి పేరు ఉంటుంది. వారు నీతికి నిజాయితీకి మారుపేరు. అంటూ ఏదో ఏదో చెప్పు బోయాడు ఉదయ్. కానీ డాక్టర్ అసహనంగా మాట్లాడుతూ మమ్మల్ని ఏం చేయమంటారు? అనడంతో ఉదయ్ అక్కడి నుండి లేచి మళ్లీ పేషెంట్ దగ్గరకు వచ్చాడు. కొద్దిసేపు నిశ్శబ్దం. అవార్డులో మిగతా పేషెంట్ల తాలూకు పేరెంట్స్ నిద్రలోకి జారుకున్నారు. మామయ్య నీకు నిద్ర వస్తున్నట్లుంది నీవు వెళ్ళు ఏదైనా అవసరం ఉంటే నేను ఫోన్ చేస్తా మహేందర్ ఉదయ్ వైపు చూస్తూమాట్లాడాడు. ఉదయ్కి ఏమి తోచట్లేదు నిశ్శబ్దంగానే మహేందర్ వైపు చూస్తున్నాడు.
మామయ్య వెళ్ళు రాత్రి మూడు గంటలు అవుతుంది. అన్నాడు మహేందర్ ఉదయ్కి పాత జ్ఞాపకాలు సుడులు తిరుగుతున్నాయి . ఉదయ్కి ఎప్పుడు కలిసిన బావ ,బావ అంటూ ఎంతో సంతోషంగా ఉండేవాడు .ఉదయ్ ఉద్యమంలో ఉన్నప్పుడుఎంతో మద్దతుగా నిల్చాడు .ఉదయ్ ఏది చెప్పినా చాలా నమ్మకంతో నడుచుకుంటూ ఆ ఆలోచనలో నడుచుకుంటూ లేచి నిలబడి ఒక్క అడుగు వేస్తూ నడుస్తున్నాడు మహేందర్ కూడా ఆసుపత్రి బయటకు అనుసరించాడు. తెల్లవారింది ఉదయ్ వృత్తి రీత్యా పాఠశాలకు వెళ్లాడు .సాయంత్రం ఐదు గంటలు కావస్తుంది. ఉదయ్ ఒక మీటింగ్ లో ఉన్నాడు, కాల్ రానే వచ్చింది .చెప్పు నాన్న మహేందర్, ఉదయ్ ఫోన్ లో అడిగాడు. మామయ్య వెంటనే బ్లడ్ ఎక్కించాలి. తొందరగా ఎవరైనా ఉంటే రమ్మంటుండ్రు లేదా అయ్యకు రక్తం కొనుక్కరమ్మన్నాడు అన్నాడు మహేందర్ ,ఓకే ,నువ్వు ఏమీ ఇబ్బంది పడకు నేను ఇప్పటికే మాట్లాడి పెట్టిన ,వాళ్ళు రక్తం ఇస్తారు ఒక గంటలోపుఇ క్కడ ఉంటారు అని చెప్పాడు .సరే అంటూ మూగబోయిన స్వరంతో ఫోన్ పెట్టేసాడు మహేందర్. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన విద్యార్థులు సూర్యుడు,రాజు గుర్తుకు వచ్చారు. ఉదయ్కి.ఈ ఇద్దరు పిల్లలు చాలు నిబద్ధత కలిగిన విద్యార్థులు. ఎవరికి ఎలాంటి ఆపదఉన్న మేమున్నామంటూ ధైర్యం ఇస్తారు .వీరికి ఉదయ్ టీచర్ అంటే ఎంతో గౌరవం చూపిస్తారు ఉదయ్ ఇద్దరికీ ఫోన్ చేసి విషయం చెప్పడంతో సార్ మేము అరగంటలో చల్మెడ దవాఖానకి వెళ్తాం వారికి చెప్పండి. అన్నాడు, సూర్యుడు.
ఆస్పత్రికి వెళ్లడానికి ఎన్నో అననుకూలతలు ఎదురైన సూర్యుడు,రాజు ఇద్దరు మహేందర్ ను కలిశారు. ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. మహేందర్ నువ్వు ఏం బాధపడకు మా రక్తం సరిపోకుంటే ఇంకో మా ఫ్రెండ్ ని కూడా రప్పిస్తాను అని ధైర్యం చెప్పాడు సూర్యుడు. అవును అంటూ మద్దతు తెలిపాడు రాజు.వెంటనే ఆ ఇద్దరినీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు మహేందర్
. డాక్టర్ గారు మా రక్తం తీయండి, మాది సరిపోకపోతే ఇంకొకరు ఉన్నారు .కానీ ఆ పేషెంట్ బ్రతకాలి అన్నాడు, సూర్యుడు. సరే అన్నట్టుగా తల ఊపి ఒక రూమ్ లోకి తీసుకుపోయి సూర్యుని నుండి రక్తం తీయడం మొదలుపెట్టారు డాక్టర్. మహేందర్ చెంపలపై నుండి కళ్ళదారులు కారుతున్నాయి. అది గమనించిన రాజుఁ మహేందర్ నువ్వు ఏడవకు నాన్నకు ఏమి కాదు మేమున్నామంటూ ధైర్యం చెబుతున్నాడు. డాక్టర్ల ప్రవర్తనలో కొంత తేడా కనిపిస్తుంది. జరగరానిది ఏమైనా జరుగుతుందా అన్నట్టుగా కొంత హడావుడి కనబడుతుంది. సూర్యుడి నుండి తీసిన రక్తమును వేరుచేసి ప్లేట్లెట్స్ ను లచ్చులు కి ఎక్కించడం మొదలుపెట్టాడు. అప్పటికే వీరి పరిస్థితిని వివరించిన ఉదయ్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి రాజు కూడా తన రక్తం తీయండి అంటూ బెడ్ మీద పడుకున్నాడు. అప్పటికే సూర్యుడు, రాజు ఒక నిర్ణయంతో వచ్చారు. ఉదయ సార్ ఇప్పటికే చాలా ఇబ్బంది పడ్డాడు. తన శక్తికి మించి సహాయం అందించాడు. వీళ్ళ దగ్గర ఏ మిడబ్బులు లేవు కాబట్టి ఒకరి రక్తాన్ని అమ్మి డబ్బులు మెడిసిన్కు ఉపయోగిద్దాం అని అనుకున్నారు. ఒకవైపు పేషెంట్ కు రక్తం ఎక్కిస్తూనే మరోవైపు సమకూర్చుకోవాల్సిన మెడిసిన్ సమర్పించుకున్నారు రాజు తన బ్లడ్ను అమ్మితే ఆసుపత్రిలో 12000 రూపాయలు ఇచ్చారు.
ఆ డబ్బుతోనే పేషెంట్ కు మందులు తెచ్చారు. డాక్టర్ తన కూర్చిలో కూర్చొని ఉన్నాడు. ఉదయ్ కూడా అంతలోనే అక్కడకు చేరాడు. మహేందర్ దిగులుపడుతూ తండ్రి దగ్గర నిలబడ్డాడు. సూర్యుడు రాజు ఇద్దరు వచ్చి ఉదయకి బ్లడ్ అమ్మిన విషయం, ప్రస్తుతం ప్లేట్లెట్స్ ఎక్కిస్తున్న విషయం చెప్పారు .ఉదయ్ కండ్ల నుండి టపటపమని కన్నీటి బిందువులు రాలాయి .ఎంత మంచి పిల్లలు .ఈ రోజుల్లో సాటి మనిషికి సహాయం చేయడం అంటేనే చాలా ఇబ్బంది పడతారు. కానీ వీరి గొప్ప మనస్తత్వానికి వీరు చేసిన ఈసహాయం ఈ జన్మలో మరువలేనిది .ఒక ఆదివాసిని బ్రతికించుకోవాదానికి వారిలో ఉన్న చైతన్యమే పురికొల్పింది. ముఖ్యంగా వారు పనిచేస్తున్న తెలంగాణలోని ఒక విద్యార్థి సంఘం యొక్క చైతన్యమే తోడైంది. అని తన మనసులోనే అనుకుంటూ కుర్చీలో కూర్చున్నాడు .కొంత సమయం తర్వాత సూర్యుడు అలసిపోయి పేషెంట్ పక్కన కూర్చు ఉంటే కూర్చున్నాడు. రాజు ఉదయ్ డాక్టర్ తో మాట్లాడుతున్నారు. సార్ పరిస్థితి ఎలా ఉంది? అని అడిగాడు ఉదయ్. కష్టమేనండి ప్రారంభంలో సరైన ట్రీట్మెంట్ ఇస్తే ఇలా జరిగేది కాదు అన్నారు డాక్టర్.
అక్కడ డాక్టర్లు లేరు సార్ వీరికి ఏదైనా అవసరం ఏర్పడితే ప్రక్క గ్రామంలో ఉండే ఆర్.ఎం.పి.ల దగ్గరికి వెలతారు ఆదివాసులు. అది కూడా అప్పుడప్పుడు దాదాపుగా మందులు వాడకుండానే మూఢనమ్మకంతో కాలం వెళ్లదీస్తారు సార్ .అని వివరించాడు. ఇంతలో మహేందర్ ఏడుస్తూ అరిచాడు డాక్టర్ డాక్టర్ అని ముగ్గురు లేచి పెషెంట్ బెడ్ వైపు వెళ్లారు డాక్టర్ దాతువు చూశాడు ఒక్కసారిగా డాక్టర్ నిర్ధాంత పోయి నిలబడ్డారు. సార్ ఏమైంది, సార్ ఏమైంది ,అంటూ ఉదయ్ చిన్న స్వరంతో అడిగాడు. రెండు అడుగులు వెనుకకు వేసి లాభం లేదండి, పేషెంట్ చనిపోయాడు అన్నాడు చిన్నబోయిన స్వరంతో అన్నాడు. డాక్టర్. ఒక్కసారిగా పరిస్థితి ఏంటో అర్థం కాలేదు. డాక్టర్ తన చైర్ లో కూర్చున్నాడు. మహేందర్ కు అర్థం అయింది. మిగతా ముగ్గురి మొహాల్లో కన్నీళ్లు దారలు.అవి చూసి మహేందర్ లబో దిబో మంటు ఏడ్వ టం మొదలు పేట్టాడు.అంతలోనే ఆ గ్రామస్తులు నలుగురు వచ్చారు. అందులో జంగా లక్ష్మీనారాయణ కూడా ఉన్నాడు మహేందర్ ఏడుపును చూసి మీరు కూడా కన్నీటిపర్వతం ఏమయ్యారు.

– ఉదయ్ కిరణ్

Spread the love