ఆ టీచర్ రిలీవ్ అయినట్లా..? కానట్లా.?

– మూడు నెలలుగా ఒక్క టీచరే బోధన
– అస్తవ్యస్తంగా రామారావు పల్లి పాఠశాల
– క్రమంగా పాఠశాలలో తగ్గుతున్న  విద్యార్థులు
– పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
నవతెలంగాణ -మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని రామరావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ నిబంధనల కంటే తక్కువగా ఉన్నారని అబద్ధపు సమాచారం చెప్పి ఇక్కడ విధులు నిర్వహిస్తున్న హెడ్ మాస్టర్ (టీచర్) అక్టోబర్ 3న రిలీవ్ కోసం మండల విద్యాధికారికి దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలిసింది.అనుమానం వచ్చిన మండల విద్యాధికారి దేవా నాయక్ పాటశాలను సందర్శించిన నేపథ్యంలో ఎంఈఓ షాక్ అయ్యారు. పాఠశాలలో 40 మంది విద్యార్థులు ఉన్నట్లుగా తెలిసింది.వెంటనే ఆ టీచర్ రిలీవ్ ఆపాలని భూపాలపల్లి జిల్లా విద్యాధికారికి సమాచారం ఇచ్చినట్లుగా ఎంఈఓ తెలిపారు. అప్పటి నుంచి పాఠశాలలో ఉన్న టీచర్ కు ఇంచార్జి ఇవ్వక, కొత్త టీచర్ ను నియమించకపోవడంతో 40 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో విద్యార్థులు క్రమంగా తగ్గుతూ  ప్రస్తుతం విద్యార్థులు 26 మంది చేరారు.బోధించే టీచర్ లేకపోవడంతో 14 మంది విద్యార్థులు ప్రయివేటు పాఠశాలల్లో చేరినట్లుగా తెలుస్తోంది.అబద్ధపు సమాచారంతో ఇటు విద్యార్థుల భవిష్యత్, అటు ప్రభుత్వాన్ని మోసం చేసిన ఆ టిచర్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
తప్పుడు  సమాచారం ఇచ్చింది.. ఎంఈఓ దేవా నాయక్
ప్రభుత్వ నిబంధనల కన్నా రామారావు ప్రభుత్వ పాఠశాలలో 10 నుంచి 12 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని తనను రిలీవ్ చేయాలని దరఖాస్తు చేసుకోవడంతో అనుమానం వచ్చిన తాము పాఠశాలను సందర్శించగా అక్కడ 35 నుంచి 40 మంది విద్యార్థులు ఉన్నారు తప్పడు సమాచారం ఇవ్వడంతో జిల్లా విద్యాశాఖ అధికారికి రిలీవ్ అపి,చర్యలు తీసుకోవాలని చెప్పాము.
ఎంఈఓ ను తెలుసుకొని ఆర్డర్ ఇస్తాం… డిఈఓ రాంకుమార్
తాడిచెర్లలోని రామారావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలపై పూర్తి సమాచారం తెలుసుకొని స్థానిక ఎంఈఓ ఆర్డర్ ఇవ్వమంటే ప్రస్తుతం ఉన్న టీచర్ కు ఆర్డర్ ఇస్తాం.
Spread the love