ఉపాధ్యాయుడిని చెట్టుకు కట్టేసి బంధించారు..

– ఉపాద్యాయుడు పై వివాహిత బంధువుల దాడి..
– పోలీస్ స్టేషన్ లో ఇరువర్గాలు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఒక ఉపాద్యాయుడు పై వివాహిత బంధువులు దాడి చేసి, చెట్టుకు బంధించిన సంఘటన ఒకటి మంగళవారం మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని నారాయణపురం పంచాయితి నెమలి పేట గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్  ప్రధానోపాధ్యాయుడు గా రాందాస్ విధులు నిర్వహిస్తున్నారు.1 నుండి 5 వ తరగతి వరకు మొత్తం ఏడుగురు విద్యార్ధులు ఉండగా మంగళవారం ముగ్గురు మాత్రమే హాజరు అయ్యారు.
పాఠశాలలో విధుల్లో ఉన్న ఉపాద్యాయుడు పై వివాహిత బంధువులు కొందరు అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డారు. పాఠశాల నుండి ఈడ్చుకుంటూ వెళ్ళి సమీపంలోని చెట్టుకు తాళ్ళతో బంధించారు. అందులో ఒకరు ఎం.ఈ.ఓ క్రిష్ణయ్య కు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన క్రిష్ణయ్య సీ.ఐ జితేందర్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. సీఐ ఇరువురు సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపారు. అక్కడకు వెళ్ళిన ఆ ఇరువురు పోలీస్ సిబ్బంది ఉపాధ్యాయుడిని, దాడికి పాల్పడ్డ వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే వార్త రాసే సమయానికి ఇరు వర్గాలు ఎవరూ రాతపూర్వక ఫిర్యాదు చేయలేదని పోలీస్ లు తెలిపారు.
అకస్మాత్తుగా దాడి చేసారు : రాందాస్,హెచ్.ఎం, జి.పి.ఎస్. నెమలి పేట
ఉదయం పూట విధినిర్వహణ లో భాగంగా 4 వ, తరగతి చదివిన భూక్యా పవన్ మారుతి టి.సి రాస్తూ ఉండగా  పాయం ధర్మారావు,స్టీవెన్సన్,చెల్లెమ్మ అనే వారు అకస్మాత్తుగా నాపై దాడి చేసారు. చెట్టుకు కట్టేసి పరువు తీసారు. గ్రామపెద్దలు మడకం ఆంద్రెయ్య, పాయం రామారావులను వేడుకున్నా కనికరించలేదు. వీరు సైతం దాడికి పాల్పడ్డారు అని టీచర్ రాందాస్ విలపించాడు.
Spread the love