విద్య, విన(యం)రు నేర్పిన అధ్యాపకుడు మళ్లీ రావాలే

– ఫిజిక్స్‌ అధ్యాపకుడు బదిలీ నాటి నుండి వేదన పడుతున్న విద్యార్థులు
– మా సార్‌ మాకే కావాలంటూ కళాశాల విద్యార్ధులు రాస్తారోకో
నవతెలంగాణ-దుమ్ముగూడెం
దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కాంట్రాక్ట్‌ బేసిక్‌ పై ఫిజిక్స్‌ అధ్యాపకుడిగా పని చేసిన పెయ్యల వినరు కుమార్‌ తిరిగి దుమ్ముగూడెం జూనియర్‌ కళాశాలకు రావాలంటూ విద్యార్ధులు పట్టుబడుతున్నారు. పెయ్యల వినరు కుమార్‌ అధ్యాపకుడిగా దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 11 సంవత్సరాల పాటు పనిచేశారు. వినరు కుమార్‌ విద్యార్ధులతో మంచి సంబందాలు కొనసాగిస్తూనే వారికి మెరుగైన విద్యతో పాటు మంచి మార్గంలో నడిచేలా తనశక్తియుక్తులను ఉపయోగించే వారు. అద్యాపకుడిగా సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ప్రతిభ కనబరచిన పేద విద్యార్దులను ప్రోత్సహించేవారు. ముఖ్యంగా గిరిజన విద్యార్ధులను ఉన్నత చదువులే లక్ష్యంగా వారిని విద్యలో ప్రోత్సహించేవారు. ఆడ పిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించేవారు. దుమ్ముగూడెం క్రాస్‌ రోడ్డు ఆడ పిల్లలు ఆర్‌టిసి, ఆటోలో ఎక్కించి వారు ఇంటికి జాగ్రత్తగా వెళ్లే విదంగా తగు చర్యలు తీసుకునే వారు. ఎవరైనా ఆకతాయిలు కళాశాల వద్దకు వస్తే పోలీస్‌ వారికి సమాచారం ఇవ్వడంతో పాటు ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసేవారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులైరేజేషన్‌ చేయడంతో గెజిటెడ్‌ హౌదాలో బదీలీపై ఖమ్మం వెళ్లారు. ఆయన బదీలీ పై వెళుతున్నాడని తెలిసిన దుమ్ముగూడెం ప్రభుత్వం జూనియర్‌ కళాశాలకు చెందిన విద్యార్దులు నాటి నుండి వేదన పడుతున్నారు. తిరిగి మన సార్‌ మనకే కావాలి అని ఉన్నతాధికారులను వేడుకుందాం అని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా గత మూడు రోజుల క్రితం విద్యార్ధులు బదీలీ పై వెళ్లిన ఫిజిక్స్‌ అధ్యాపకుడు తిరిగి దుమ్ముగూడెం జూనియర్‌ కళాశాలకు రావాలి అంటూ లకీëనగరం నుండి దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వరకు రాస్తారోకో నిర్వహించారు.
మనస్సు భాదిస్తోంది : పెయ్యల వినరు కుమార్‌ (ఫిజిక్స్‌ అధ్యాపకుడు)
దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 11 సంవత్సరాల పాటు కాంట్రాక్ట్‌ బేసిక్‌ పై అధ్యాపకుడిగా పని చేసి ఖమ్మం రావడం భాధ కలిగిస్తోంది. ఉద్యోగ దర్మంలో బదీలీలు సర్వ సాధారణమే. అయినప్పటికీ అక్కడ పని చేసిన సమయంలో విద్యార్ధులతో మమేకమై వారి ఉన్నతి కోసం కృషి చేశాను. అందులో భాగంగానే విద్యార్ధులు తన పై ఉన్న అభిమానాన్ని మరచి పోలేక తిరిగి దుమ్ముగూడెం జూనియర్‌ కళాశాలకు రావాలని కోరుకుంటున్నారని ఆయన నవతెలంగాణకు తెలిపారు. అవకాశం ఉంటే మళ్లీ దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు వస్తానని విద్యార్దుల వేదనకు తన మనస్సు చలించిందని తన వేదనను సైతం వెలిబుచ్చుకున్నారు.

Spread the love