స‌చివాల‌యంలో ముగిసిన తెలంగాణ‌ క్యాబినెట్ స‌మావేశం

నవతెలంగాణ – హైద‌రాబాద్ : తెలంగాణ స‌చివాల‌యంలో మంత్రివ‌ర్గ స‌మావేశం ముగిసింది. సీఎం రేవంత్ అధ్య‌క్ష‌త‌న క్యాబినెట్ భేటీ జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి. ఈ స‌మావేశానికి డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు, సీఎస్ శాంతి కుమారి, వివిధ శాఖ‌ల కార్య‌ద‌ర్శులు హాజ‌ర‌య్యారు. క్యాబినెట్ భేటీలో ఆరు గ్యారెంటీల అమ‌లు, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించారు. గురువారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట స‌మ‌యంలో ఎల్‌బీ స్టేడియం వేదిక‌గా రేవంత్ రెడ్డి సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన సంగ‌తి తెలిసిందే. డిప్యూటీ సీఎంగా భ‌ట్టి విక్ర‌మార్క‌, ప‌లువురు మంత్రులుగా ప్ర‌మాణం చేశారు. అదే వేదిక నుంచి ఆరు గ్యారెంటీల అమ‌లు ద‌స్త్రంపై రేవంత్ తొలి సంత‌కం చేశారు.

Spread the love